ప్రభాస్ ఆ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న నాగ్ అశ్విన్..అంతగా నచ్చిందా?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా నటుడిగా వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయినటువంటి ఈయన ఇటీవల సలార్ సినిమా( Salaar Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి 700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టారు.

ఈ సినిమా 1000 కోట్లు రాబడుతుందని అందరూ భావించినప్పటికీ కొన్ని ప్రాంతాలలో మిక్స్డ్ టాక్ రావడంతో 700 కోట్ల వరకే కలెక్షన్లను రాబట్టింది.

ఇక ఈ సినిమా పార్ట్ 2( Salaar 2 ) కూడా రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ప్రస్తుతం ఈ సినిమాపై ప్రశాంత్( Prasanth Neel ) ఇంట్రెస్ట్ చూపడం లేదని ప్రస్తుతం ఈయన ఎన్టీఆర్ సినిమా పనులలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.కానీ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ మాత్రం ఈ సినిమా ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతుందని వెల్లడించారు.

ఇక ఇటీవల ప్రభాస్ కల్కి సినిమా( Kalki Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టారు.ఇప్పటికీ సినిమా కలెక్షన్స్ భారీగానే వస్తున్నాయి.

Advertisement

చూస్తుంటే ఈ సినిమా 1200 కోట్ల వరకు కలెక్షన్స్ సునాయసంగా రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్( Nag Ashwin ) వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సలార్ 2, పుష్ప 2, సింగం సీక్వెల్స్ ఇలా అన్ని పార్ట్ 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.

మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ ప్రభాస్ సలార్ 2 కోసం తాను ఎదురుచూస్తున్నానని తెలిపారు.తనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి సినిమాలంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు.

సలార్‌లో వేరే ప్రపంచాన్ని క్రియేట్ చేశారు.ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉందని నాగ్ అశ్విన్ తెలిపారు.

రూ.1000 కోట్లు సాధించిన కల్కి.. ఎన్టీఆర్, బన్నీ, చరణ్ సినిమాలు ఈ రికార్డ్ బ్రేక్ చేస్తాయా?
Advertisement

తాజా వార్తలు