సూపర్ స్టార్ మహేష్ ను దేవునితో పోల్చిన అన్వేష్.. ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

తెలుగు యూట్యూబ్ అన్వేష్(Telugu YouTube Anvesh) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.యూట్యూబ్ ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి అన్వేష్ తప్పనిసరిగా తెలిసే ఉంటాడు.

దేశ విదేశాలు చుట్టేస్తూ అక్కడి సంస్కృతి సాంప్రదాయాలను వంటలను ఎప్పటికప్పుడు యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి తెలియజేసేలా వీడియోలు చేస్తూ ఉంటాడు.ఇకపోతే అన్వేష్ గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్స్ పై గట్టిగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణ ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ సజ్జనార్‌ తో ఇటీవలే అన్వేష్ దీని గురించి మాట్లాడాడు.డబ్బుుల తీసుకుంటూ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్న వారిని వదలొద్దు అంటూ వీడియోలు పెడుతూనే ఉన్నాడు అన్వేష్.

Naa Anveshana Youtuber Anvesh Great Words About Mahesh Babu Balakrishna, Naa Anv
Advertisement
Naa Anveshana Youtuber Anvesh Great Words About Mahesh Babu Balakrishna, Naa Anv

ఇందులో భాగంగా యూట్యూబర్ హర్షసాయిపై కూడా గట్టిగానే ఫైర్ అయ్యాడు అన్వేష్.హర్షసాయి గురించి చెబుతూ మహేష్ బాబు(Mahesh Babu) సహా టాలీవుడ్ హీరోలపై ప్రశంసలు కురిపించాడు.

ఈ సందర్భంగా అన్వేష్ మాట్లాడుతూ.సహాయం పేరుతో సమాజాన్ని మోసం, దగా చేస్తున్న యూట్యూబర్లలో హర్షసాయి (Harsha Sai)నెంబర్ 1.రూ.10 ఇచ్చి రూ.లక్ష వెనక్కి తీసుకుంటున్నాడు.అందులో మళ్లీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంటూ హర్షసాయి పై ఒక రేంజ్‌లో ఫైర్ అవుతున్నాడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్.

ఒక చేతితో చేసిన సాయం రెండో చేతికి కూడా తెలీకూడదు.అదీ మన భారతదేశ సంస్కృతి.మహేష్ బాబు (Mahesh Babu)గారు కొన్ని వందల మంది పిల్లలకి గుండె సర్జరీ చేయించారు.

Naa Anveshana Youtuber Anvesh Great Words About Mahesh Babu Balakrishna, Naa Anv
95 పైసల కోసం ఇంత రచ్చా? క్యాబ్ డ్రైవర్‌తో జర్నలిస్ట్ వార్.. వీడియో వైరల్..
ఆ పాత్ర శారీరకంగా ఎన్నో సవాళ్లు విసిరింది.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఎవరికైనా తెలుసా.మీకు ఎవరికైనా తెలుసా, ఒక్క వీడియో అయినా బయటికొచ్చిందా, ఎంతోమంది చిన్న పిల్లల ప్రాణాలు కాపాడిన దేవుడు.

Advertisement

ఇదీ సాయమంటే అంటూ మహేష్ బాబు గురించి చెబుతూ ప్రశంసలు కురిపించారు అన్వేష్(Anveesh).ఈ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ అన్వేష్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు మహేష్ బాబు అభిమానులు.

నా అన్వేష్ బెట్టింగ్ యాప్స్ గురించి అందులో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వారి గురించి ఎప్పుడైతే వీడియోలు చేయడం మొదలుపెట్టాడో అప్పటినుంచి ఆయనకు మద్దతు మరింత పెరిగిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు