నల్గొండ జిల్లాలో మిస్టరీ డ్రోన్ కలకలం..!

నల్గొండ జిల్లాలో ఓ మిస్టరీ డ్రోన్ కలకలం చెలరేగింది.శాలిగౌరారం మండలంలోని ఆకారం గ్రామ సమీపంలో విమానం ఆకారంలో ఉన్న డ్రోన్ కూలింది.

పంట పొలాల్లో పడిన డ్రోన్‎ను గమనించిన గొర్రెల కాపరి పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రోన్ ను శాలిగౌరారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కాగా ఈ డ్రోన్ లో జీపీఎస్ చిప్, ఎయిర్ టెల్ సిమ్ తో పాటు ఓ కెమెరాను గుర్తించారు.డ్రోన్ ను ఎవరు ఉపయోగించారు.? ఎక్కడ నుంచి వచ్చిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?
Advertisement

తాజా వార్తలు