తాడేపల్లికి చేరిన మైలవరం పంచాయతీ

ఎన్టీఆర్ జిల్లా మైలవరం పంచాయతీ మరోసారి సీఎం జగన్ దగ్గరికి చేరనుంది.ఇవాళ సాయంత్రం మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ సీఎం జగన్ ను కలవనున్నారు.

గత కొంతకాలంగా మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు ఇరువురి మధ్య సయోధ్యకు పార్టీ పెద్దలు ప్రయత్నించారు.

కానీ ఎలాంటి మార్పు కనిపించలేదని తెలుస్తోంది.మైలవరంలో రెండు వర్గాలుగా విడిపోయిన వైసీపీ నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.

తాజాగా రెండు రోజుల కిందట రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ వద్దకు ఇరు వర్గాలు ఫిర్యాదు చేశాయి.ఈ విషయంపై సాయంత్రం జగన్ తో ఎమ్మెల్యే సమావేశం కానున్నారని తెలుస్తోంది.

Advertisement

గత కొన్ని రోజులుగా వైసీపీ నేతలతో దూరంగా ఉంటూ వస్తున్న ఎమ్మెల్యే గుంటూరు తొక్కిసలాట ఘటనలో ఉయ్యూరు శ్రీనివాస్ కు మద్ధతుగా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement