మైగ్రేన్‌కు చెక్ పెట్టే ఆవాలు..ఎలా వాడాలంటే?

మైగ్రేన్ త‌ల‌నొప్పి‌.నేటి ఆధునిక కాలంలో చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య ఇది.

మైగ్రేన్ తలనొప్పి చాలావరకు తలకు ఒక పక్క మాత్ర‌మే వస్తుంది.అందుకే దీనిని పార్శ్వపు నొప్పి అని కూడా పిలుస్తుంటారు.

అధిక ఒత్తిడి, నిద్ర లేమి, ఎక్కువ స‌మ‌యం పాటు ఎండలో ఉండడం, డిప్రెషన్‌, ఆహార‌పు అల‌వాట్లు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ‌‌తలలోని రక్తనాళాల మీద ఒత్తిడి పడుతుంది.దాంతో మైగ్రేన్ త‌ల‌నొప్పి ఏర్ప‌డుతుంది.

సాధార‌ణ త‌ల‌నొప్పి కంటే వంద రెట్లు ఎక్కువ బాధ‌ను క‌లిగించే ఈ మైగ్రేన్ వ‌ల్ల ఇటీవ‌ల కాలంలో ఎంత‌రో నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.అయితే కొన్ని కొన్ని చిట్కాలు ఫాలో అయితే.

Advertisement
Mustard Seeds Helps To Reduce Migraine Headache-మైగ్రేన్‌క�

చాలా త్వ‌ర‌గా మైగ్రేన్ త‌ల‌నొప్పిని నివారించుకోవ‌చ్చు.ముఖ్యంగా ఆవాలు మైగ్రేన్‌కు చెక్ పెట్ట‌డంలో అద్భుతంగా ప‌ని చేస్తాయి.

వంటింటి పోపుల డబ్బాలో ఖ‌చ్చితంగా ఉండే వాటిలో ఆవాలు ఒక‌టి.పోపు వేయాలంటే.

ముందుగా గుర్తుకు వ‌చ్చేది కూడా ఆవాలే.పురాత‌న కాలం నుంచి ఆవాల‌ను విరి విరిగా ఉప‌యోగిస్తుంటారు.ఆవాల్లో పోష‌కాలూ మెండుగానే ఉంటాయి.

అందుకే వీటిని ప‌లు జ‌బ్బుల‌కు ఔష‌ధంగా కూడా వినియోగిస్తారు.ముఖ్యంగా మైగ్రైన్ త‌ల‌నొప్పితో బాధ ప‌డే వారు.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

కొన్ని ఆవాల‌ను తీసుకుని మెత్త‌గా పొడి చేసుకోవాలి.ఆ పొడిలో కొద్దిగా వాట‌ర్ మిక్స్ చేసి.

Advertisement

నొప్పి వస్తున్న వైపు లేపనంగా పూయాలి.

Mustard Seeds Helps To Reduce Migraine Headache

ఇలా చేస్తే మైగ్రేన్ తలనొప్పి క్ష‌ణాల్లోనే త‌గ్గుముఖం ప‌డుతుంది.అలాగే ప్రతిరోజూ నాలుగు గ్రాముల ఆవాలను ఏదో ఒక రూపంలో తీసుకుంటే మైగ్రేన్ క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుంది.ఇక మైగ్రేన్ త‌ల‌నొప్పి మాత్ర‌మే కాదు.

కీళ్ల నొప్పుల‌ను కూడా ఆవాలు నివారిస్తాయి.ఆవాలను పొడి చేసి అందులో కొద్దిగా నీరు మ‌రియు కర్పూరం కలిపి కీళ్లపై అప్లై చేసి మ‌సాజ్ చేసుకుంటే.

నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు.‌.

తాజా వార్తలు