నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ ( Thaman ) ఒకరు కాగా థమన్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.

రెమ్యునరేషన్ పరంగా కూడా థమన్ టాప్ లో ఉన్నారు.

మధ్యలో కొన్నేళ్ల పాటు థమన్ కు ఆఫర్లు తగ్గినా ఈ మ్యూజిక్ డైరెక్టర్( Music Director ) మళ్లీ కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు.మజిలీ సినిమాకు కేవలం వారం రోజుల్లోనే మ్యూజిక్ అందించానని థమన్ చెప్పుకొచ్చారు.అనుభవంతో మాత్రమే ఏదైనా సాధ్యమవుతుందని ఆయన కామెంట్లు చేశారు.11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుంచే వర్క్ చేయడం మొదలుపెట్టానని థమన్ తెలిపారు.భైరవద్వీపం సినిమాకు( Bhairava Dweepam ) డ్రమ్స్ వాయించినందుకు 30 రూపాయలు రెమ్యునరేషన్ గా ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తండ్రి మరణించారని థమన్ పేర్కొన్నారు.

Music Director Thaman Emotional Comments About His Father Details, Music Directo

ఆ సమయంలో చెల్లి రెండో తరగతి చదువుతోందని నాన్న మరణించినా నా కంటి నుంచి చుక్క నీరు కూడా రాలేదని ఆ సమయంలో అమ్మను, చెల్లిని ఎలా చూసుకోవాలనే ఆలోచనలో నేను ఉండిపోయానని థమన్ వెల్లడించారు.మా నాన్నకు వచ్చిన ఎల్.ఐ.సీ డబ్బులతో సంగీత పరికరాలు కొని మ్యూజిక్ పై దృష్టి పెట్టానని ఇప్పుడు అమ్మ వయస్సు 74 సంవత్సరాలు అని థమన్ వెల్లడించారు.

Music Director Thaman Emotional Comments About His Father Details, Music Directo

అమ్మను కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నానని థమన్ అన్నారు.మంచి సంగీతం అందించాలని 100 శాతం ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు.అల వైకుంఠపురములో సాంగ్స్ కు హుక్ స్టెప్ ఉందని థమన్ చెప్పుకొచ్చారు.

Advertisement
Music Director Thaman Emotional Comments About His Father Details, Music Directo

అరవింద సమేత సినిమాలోని పెనిమిటి సాంగ్ నేను ఎంతో కష్టపడిన సాంగ్ అని థమన్ వెల్లడించరు.థమన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అందరు స్టార్ హీరోలతో కలిసి పని చేశారు.

సినిమాల కౌంట్ విషయంలో సైతం థమన్ ఇతర మ్యూజిక్ డైరెక్టర్లకు భారీ షాక్ ఇస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు