పుష్ప 2 సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలలో పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా ఒకటని చెప్పాలి.

ఈ సినిమా కోసం అభిమానులతో పాటు సెలబ్రెటీలు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 5వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే దేవి శ్రీ ప్రసాద్( Devi sri prasad ) సుకుమార్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని అందుకే చివరిలో ఈ సినిమా కోసం థమన్ ( Thaman ) ను తీసుకున్నారంటూ వార్తలు వినిపించాయి .ఇక తమన్ సైతం వరుస సినిమాలో పనులలో ఎంతో బిజీగా ఉన్నారు ఇక బాబి డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాకి కూడా సంగీతమ అందిస్తున్న సంగతి తెలిసింది.తాజాగా ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

Advertisement

ఈ సినిమాకు డాకు మహారాజ్ ( Daku Maharaj )అనే టైటిల్ ఖరారు చేయడమే కాకుండా ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కాబోతుందని తెలిపారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్స్ తమన్  ను ప్రశ్నిస్తూ మీరు ఇప్పటికే వరుస సినిమా పనులలో బిజీగా ఉన్నారు మరోవైపు పుష్ప 2సినిమా బాధ్యతలను కూడా తీసుకున్నారు అంటూ ప్రశ్న వేశారు ఈ ప్రశ్నకు తమను సమాధానం చెబుతూ పుష్పా సినిమాలో నేను కేవలం ఒక చిన్న భాగం మాత్రమేనని తెలిపారు.పుష్ప2 సినిమాలో నేను భాగమైనందుకు డైరెక్టర్ హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని తమన్ వెల్లడించారు.ఇక పుష్ప2 సినిమాని తాను చూసానని చాలా అద్భుతంగా ఉందని ఇదొక గొప్ప సినిమా అంటూ పుష్ప2 సినిమాపై తమన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు