బూట్లు తీసి మరీ కొట్టుకున్న పోలీసులు

జనాలకు ఏదైనా సమస్య వస్తే వెంటనే వచ్చి ఆ సమస్యను పరిష్కరించడం, ఫిర్యాదులు అందిస్తే రంగంలోకి దిగి వాటిపై దర్యాప్తు చేసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటూ పోలీసులు ప్రజల మంచి చెడ్డలు చూసుకుంటూ ఉంటారు.

అందుకే ఆపదలో ఉన్నవారికి ఎవరికైనా వెంటనే పోలీసులు గుర్తుకు వస్తుంటారు.

అయితే అటువంటి పోలీసుల మధ్య ఏదైనా సమస్య వస్తే ఎవరు పరిష్కరిస్తారు ? ఉన్నతాధికారులు పరిష్కరిస్తారు.అయితే ఈ ఇద్దరు పోలీసులు మాత్రం అలా అనుకోలేదు.

తమ సమస్యకు తామే పరిష్కారం వెతుక్కుందామనుకున్నారో ఏమో కానీ నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కుమ్ములాట మొదలుపెట్టారు.ఇద్దరు పోలీసులు నడి రోడ్డుపై బాహా బాహికి దిగిన సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైకి దగ్గరల్లోని భండారా జిల్లా పోలీస్‌ హెడ్ క్వార్టర్స్‌లో జరిగింది.

విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులు ఒకరి మీద మరొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ తన్నుకున్నారు.ఈ విషయంలో ఎవరూ తగ్గకుండా ఒకరి మీద ఒకరు రెచ్చిపోయారు.

Advertisement

అయినా ఈ ఇద్దరి మధ్య కసి తీరలేదు ఏమో కానీ బూట్లు తీసి మరీ కొట్టుకున్నారు.ఇలా నడి రోడ్డుమీద కొట్టుకున్న ఈ ఇద్దరు ఖాకీల పేర్లు విష్ణు కేడికర్, వికాస్ గైక్వాడ్‌.

వీరు దాడికి పాల్పడుతున్న సమయంలో నిలువరించేందుకు సివిల్‌ డ్రెస్‌లో ఉన్న పక్కనున‍్నవారు ప్రయత్నించారు.కానీ అక్కడ ఉన్న మిగతా పోలీసులు మాత్రం వినోదం చూసారు.

చివరికి సివిల్‌ డ్రెస్‌లో ఓ వ్యక్తి ఒకరిని పట్టుకుని పక్కకు తీసుకుని వెళ్లడం తో ఆ వివాదానికి అక్కడితో బ్రేక్ పడింది.అయితే ఈ ఇద్దరి విషయంలో ఉన్నతాధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 1, శనివారం 2023
Advertisement

తాజా వార్తలు