నేడే ముంబై - లక్నో ఎలిమినేటర్ మ్యాచ్.. రోహిత్ సేన ప్రయోగలు ఫలిస్తాయా..!

నేడు ఎలిమినేటర్ ( Eliminator match )మ్యాచ్ ముంబై - లక్నో( MI vs LSG ) మధ్య చాలా ఉత్కంఠ భరితంగా సాగనుంది.

ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు గుజరాత్ తో క్వాలిఫయర్ -2 ఆడుతుంది.

ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది.కాబట్టి రెండు జట్ల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది.

అయితే ముంబై జట్టు ఫ్యాన్స్ కాస్త కలవర పడుతున్నారు.గుజరాత్ చేతిలో బెంగుళూరు ఓడిపోవడంతో ముంబై జట్టుకు అదృష్టం కలిసి వచ్చింది.

దీంతో ముంబై జట్టు ప్లే ఆఫ్ కు చేరింది.కానీ ఇప్పుడు రోహిత్ ( Rohit )సేన మెరుగైన ఆటను ప్రదర్శిస్తేనే క్వాలిఫయర్-2 కు వెళుతుంది.

Advertisement

ఐదు సార్లు టైటిల్ కొట్టిన ముంబై( 5 times Title winner Mi ) జట్టుకు ఇది ఒకరకంగా కఠిన సవాలే.లక్నో రెగ్యులర్ కెప్టెన్ కె.

ఎల్.రాహుల్ అందుబాటులో లేనప్పటికీ, తాత్కాలిక కెప్టెన్ క్రునాల్ పాండ్యా సారథ్యంలో లక్నో జట్టు మెరుగైన ఆటనే ప్రదర్శిస్తోంది.కాబట్టి రోహిత్ సేన ఒకవైపు బ్యాటింగ్లో, మరోవైపు ఫీల్డింగ్ లో మెరుగైన ఆటను ప్రదర్శన చేయకతప్పదు.

ఇరుజట్లను ఆట తీరును పరిశీలిస్తే.ముంబై జట్టుకు అత్యంత కీలకము బ్యాటింగ్.నేడు జరిగే మ్యాచ్లో కామెరున్ గ్రీన్, సూర్య కుమార్ యాదవ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లు ఎక్కువసేపు క్రీజూ లో ఉండడంతో పాటు లక్నో బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇది ఒక రకంగా ముంబై జట్టుకు కఠిన సవాలే.ఇక ముంబై జట్టులో ఉండే బౌలర్ జాసన్ బెహ్రెండార్ఫ్ కీలక పాత్ర పోషించి సమర్ధవంతంగా రాణిస్తే ముంబై ఈ మ్యాచ్లో గెలిచే అవకాశం ఉంది.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

ఇక లక్నో జట్టు విషయానికి వస్తే ఈ జట్టుకు బౌలింగ్ ఎంతో కీలకం.లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ నిలకడగా రాణిస్తూ ప్రత్యర్థి జట్టు వికెట్లు తీయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఇతనితో పాటు నవీన్ ఉల్ హక్, అవేశ్ ఖాన్, అమిత్ మిశ్రా లు లక్నో జట్టు విజయంలో కీలకపాత్రను పోషిస్తున్నారు.

Advertisement

ఇక ఆల్రౌండర్ మర్కస్ స్టోయినిస్ ఎంతో అద్భుతంగా రాణిస్తున్నాడు.ఇతనితోపాటు కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, క్వింటన్ డికాక్ లు కాస్త మెరుగైన ఆటను ప్రదర్శిస్తే లక్నో జట్టు సులభంగా విజయం సాధిస్తుంది.

తాజా వార్తలు