బిగ్‌ బాస్‌ : అవినాష్‌కు ఇకపై గొడవలు తప్పవా?

బిగ్ బాస్ హౌస్ లో రెండవ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా అడుగు పెట్టిన జబర్దస్త్ అవినాష్ ఇప్పటి వరకు అందరితో చాలా మంచితనంతో మెలుగుతూ వచ్చాడు.

ఆ కారణంగానే ఆయన ఇప్పటి వరకు ఒక్క వారం కూడా ఎలిమినేషన్ కు నామినేట్ అవ్వలేదు.

ఆయన మంచితనం కారణంగానే ఎలిమినేషన్ కు నామినేట్ కావడం లేదని ఆయన ఇంటి సభ్యులందరితో కూడా చాల సరదాగా ఉంటూ కామెడీ చేస్తూ ఉన్న కారణంగా ఇన్ని రోజులు ఎలిమినేషన్ అవ్వలేదు.కానీ ఈ వారం హోటల్ టాస్క్‌ లో భాగంగా ఆయన సీక్రెట్‌ టాస్క్‌ చేయాల్సి ఉంది.

Bigg Boss Contestant Avinash Entertaining Housemates, Bigg Boss Contestant Avina

అందులో భాగంగా అవినాష్ కొందరు ఇంటి సభ్యులను ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది.ఆ కారణంగా ఇంటి సభ్యులు అతడిపై సీరియస్‌ అయ్యే అవకాశం ఉంది.

నిన్నటి ఎపిసోడ్‌ లోనే అవినాష్ పై హారిక మరియు అరియానాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ పరిణామాలు చూస్తుంటే ఇకపై అవినాష్ వరుసగా ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇప్పటి వరకు అందరితో మంచిగా ఉంటూ అందరిని నవ్విస్తూ వచ్చిన ఆయన ఇక ఇతర ఇంటి సభ్యులతో గొడవ పడాల్సి రావచ్చు.గత వారం ఎలిమినేషన్ సందర్భంగా ఒకరిద్దరు తో చర్చలు జరిగినా అవి అతని గురించి బయట ఎక్కువగా వ్యతిరేక ప్రచారం జరగేలా చేయలేదు.

కానీ ఇకపై ఇంటి సభ్యులు అతడిని టార్గెట్ చేసే అవకాశం ఉంది.ఆ కారణంగానే బిగ్ బాస్ హౌస్ లో ఇకపై అవినాష్ కు అంతా మంచిగా ఉండదేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న ఇద్దరు ముగ్గురు లో అవినాష్ ముందు ఉంటాడు అనడంలో సందేహం లేదు.అందుకే నాగార్జున కూడా ఇష్టమైన కంటెస్టెంట్‌ గా అవినాష్‌ పేరు దక్కించుకున్నాడు.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?
Advertisement

తాజా వార్తలు