అయోధ్య రామ మందిర నిర్మాణంకు వైసీపీ ఎంపీ విరాళం ! ఎంతో తెలుసా ?

అయోధ్య లో రామమందిరం నిర్మించాలనే కల త్వరలో సాకారం కాబోతుంది.అందుకు కేంద్ర ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లను సిద్దం చేస్తుంది.

ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ కూడా చేశాడు.ఈ నెల 15 నుండి రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్నారు.

MP Raghuramakrishnam Raju Donate The Fund Construct The Rama Mandiram , MP Raghu

అందుకు వి‌హెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్, వంటి సంస్థలు బాగస్వామ్యం అవ్వుతున్నాయి.ముందుగా రాముడి ఆలయ నిర్మాణం కోసం దేశ ప్రథమ పౌరుడు రాష్ట్ర పతి రామ్ నాథ్ కొవింద్ మొదట విరాళంగా 5,00,1000 రూపాయలను ఇచ్చాడు.

ఈ నేపథ్యంలోనే నరసాపురం ఎం‌పి రఘు రామకృష్ణం రాజు 1,11,111 రూపాయలను విరాళంగా ఇచ్చాడు.అంతకు ముందు భూమి పూజ సందర్భంగా మూడు నెలల జీతం ను విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ మందిరనిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాగస్వామ్యం కావాలని కోరాడు.తాము ఎంత ఇచ్చింది అనేది ముఖ్యం కాదు అన్నాడు.10 రూపాయలనుండి 100 రూపాయల వరకు ఇవ్వొచు అన్నాడు.ఆయన ఇచ్చిన విరాళం మొత్తాని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు విరాళాలను పంపించేందుకు అవసరమైన వివరాలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఓ వజ్రాల వ్యాపారి ఏకంగా 11 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చాడు.

Advertisement

తాజా వార్తలు