జగన్ కు సినిమా చూపిస్తా : రఘురామ వార్నింగ్ !

వైసిపి ఆ పార్టీ అధినేత జగన్ విషయంలో అదే పార్టీకి చెందిన రఘురామకృష్ణంరాజు ఓ రేంజ్ లో ఫైర్ అవుతూనే వస్తున్నారు.

నిత్యం ఏదో ఒక అంశంపై వరుసగా లేఖలు రాస్తూ జగన్ కు చికాకు తెప్పిస్తూ వస్తున్న రఘురామకృష్ణంరాజు తన విమర్శల డోసును మరికాస్త పెంచారు.

తను ఫోను ఎవరి అనుమతి లేకుండా ఓపెన్ చేసినందుకు సినిమా ఎలా ఉంటుందో చూపిస్తాను అంటూ హెచ్చరికలు చేశారు.చాలా కాలంగా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ నిందలు వేశారని, దీనిపై చాలామంది కారు కూతలు కూశారు అని, సుప్రీం తీర్పుతో ఏం సమాధానం చెబుతారు అంటూ జగన్ ను నిలదీశారు.

తనపై అనర్హత పడదని, జగన్ బెయిల్ రద్దు చేయమని అనడం రాజద్రోహం కేసు ఎలా అవుతుంది అంటూ మండిపడ్డారు.జగన్ బెయిల్ రద్దు చేయాలని తాను వేసిన పిటిషన్ దేశంలోని అందరి రాజకీయ నాయకులకు పంపించానని, దీనిపై వారు రకరకాల ప్రశ్నలు అడిగారని, పిటిషన్ ను పంపితే తప్పేంటని , పంపొద్దు అనడానికి నువ్వు ఎవరు అంటూ జగన్ పై ఫైర్ అయ్యారు.

ఇక ఏపీ కి ప్రత్యేక హోదా అంశంపైనా రఘురామ స్పందించారు .ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో జగన్ ఆదేశిస్తే రాజీనామాకు ఎంపీలందరూ సిద్ధంగా ఉన్నారా అని చెప్పుకొచ్చారు.

Mp Raghu Ramakrishnam Raju Sensational Comments On Jagan Mp Raghu Ramakrishna Ra
Advertisement
Mp Raghu Ramakrishnam Raju Sensational Comments On Jagan MP Raghu Ramakrishna Ra

పోలవరానికి 55 వేల కోట్లు ఇవ్వాలని అంటున్నారని , మన స్టాండ్ క్లియర్ గా ఉండాలి కదా అంటూ జగన్ కు చురకలంటించారు.తన ఫోన్ లోని వాట్సాప్ లో చాటింగ్ బయటపెడతామని అంటున్నారు.నా ఫోన్ పోలీసులు తీసుకున్నారు.

నేను ఎవరికి మెసేజ్ చేస్తే మీకు ఏంటి ? అది రాజద్రోహం కేసు ఎలా అవుతుంది ? పెగసెస్ సాఫ్ట్వేర్ మీరు తెప్పించారు అని అంటున్నారు.మీరు చాలా మంది పై వాడారని అంటున్నారు.

దానికి మీరు కేంద్రం వద్ద అనుమతి తీసుకున్నారా అంటూ రఘురామ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తాజా వార్తలు