రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ఎంపీ కోమటిరెడ్డి రియాక్షన్

బీజేపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా విషయం తనకు తెలియదని తెలిపారు.

రాజగోపాల్ రెడ్డి తనతో సంప్రదించలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తమలో ఎవరూ ముఖ్యమంత్రి అయినా ఆరు గ్యారెంటీలపైనే తొలి సంతకమని చెప్పారు.

ఈ క్రమంలో సీఎం అభ్యర్థి ఎవరన్నది పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందని తెలిపారు.తమ నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అయిపోయిందన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ కు 70 నుంచి 85 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.అదేవిధంగా రేపు రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల అవుతుందన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరు స్థానాల్లో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు.

Advertisement
ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?

తాజా వార్తలు