ఆ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌కు మోత్కుప‌ల్లి భ‌యం..

రాజ‌కీయ పార్టీలు అన్న త‌ర్వాత చేరిక‌లు, జంపింగ్‌లు అనేవి చాలా కామ‌న్ క‌దా.

అయితే ఇందులో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇంకొంచెం ముందు వ‌రుస‌లో ఉంటుందేమో.

ఎందుకంటే తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత అప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా టీఆర్ ఎస్‌లోకి విప‌రీతంగా చేరిక‌లు జ‌రిగాయి.అదే స‌మ‌యంలో ఈ పార్టీ నుంచి కూడాచాలా మంది వీడిపోయారు.

ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీఆర్ఎస్ లోకి మోత్కుపల్లి నరసింహులు కూడా చేరిపోయారు.ఆయ‌న మాజీ మంత్రిగా మంచి ఇమేజ్ ఉన్న లీడ‌ర్‌.

పైగా కేసీఆర్‌కు చాలా స‌న్నిహితంగా మెలిగే వ్య‌క్తి.మ‌రి ఏ రాజ‌కీయ పార్టీలో అయినా ఒక లీడ‌ర్ వ‌స్తున్నారంటే మిగ‌తా వారికి ఇబ్బందిగానే ఉంటుంది.

Advertisement
Mothkupally Fear For Those TRS MLAs Details, Mothkupally Narasimhulu, Trs, Aleru

ఎందుకంటే ఆయ‌న వ‌స్తే ఎక్క‌డ తమ ప‌ద‌వుల‌కు గండం ఏర్ప‌డుతుందో అనే భావ‌న అంద‌రిలోనూ ఉంటుంది.ఇప్పుడు టీఆర్ఎస్ లో కూడా ఇలాంటి ప‌రిస్థితే ఉంది.

ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు నేత‌ల‌కు మోత్కుప‌ల్లి భ‌యం ప‌ట్టుకుంది.ఇప్పుడు ద‌ళిత‌బంధు లాంటి స్కీములు పెడుతూ ద‌ళితులను త‌న‌వైపు తిప్పుకునేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తున్న కేసీఆర్‌.

మోత్కుప‌ల్లికి అత్యంత ప్రధాన్యత ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

Mothkupally Fear For Those Trs Mlas Details, Mothkupally Narasimhulu, Trs, Aleru

దీంతో నల్గొండ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మోత్కుప‌ల్లి టెన్ష‌న్‌ మొదలైంది.ముఖ్యంగా ఆలేరు, నకిరేకల్, తుంగదుర్తి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ భ‌యం ఉంది.ఎందుకంటే ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాలు తుంగ‌తుర్తి, న‌కిరేక‌ల్ ఎస్సీ రిజ‌ర్వుడు కావ‌డం అలాగే ఆలేరు జరనల్ కావ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

కానీ మోత్కుప‌ల్లి గ‌తంలో తుంగుతుర్తికి, ఆలేరుకు ఎమ్మెల్యేలుగా ప‌నిచేశారు.కాబ‌ట్టి మ‌ల్లీ కేసీఆర్ వీటిల్లో ఆయ‌న‌కు ఏదైనా ఒక టికెట్ ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వారు ఆందోళ‌న చెందుతున్నారంట‌.

Advertisement

చూడాలి మ‌రి కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో.

తాజా వార్తలు