ఈ చలికాలంలో జలుబు, దగ్గు తగ్గడం లేదా.. అయితే ఈ పవర్ ఫుల్ డ్రింక్ ను మీరు తీసుకోవాల్సిందే!

ప్రస్తుత చలికాలంలో ( winter )పిల్లల నుంచి పెద్దల వ‌ర‌కు ఎంతో మంది జలుబు, దగ్గు( Cold, cough ) సమస్యలతో బాగా ఇబ్బంది పడుతున్నారు.

ఎన్ని మందులు వాడినా సరే ఇవి మాత్రం ఓ పట్టాన వదిలిపెట్టడం లేదు.

మీరు కూడా జలుబు, దగ్గు సమస్యలతో సతమతం అవుతున్నారా.? ఎన్ని చేసినా అవి తగ్గడం లేదా.? అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ డ్రింక్ ను మీరు తాగాల్సిందే.వరుసగా రెండు మూడు రోజులు ఈ డ్రింక్ ను తీసుకున్నారు అంటే ఎలాంటి దగ్గు జలుబు అయినా పరార్ అవ్వాల్సిందే.

మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటో తెలుసుకుందాం ప‌దండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పది నానబెట్టి తొక్క తొలగించిన బాదం పప్పులు వేసుకోవాలి.అలాగే రెండు నుంచి మూడు పచ్చి పసుపు కొమ్ము స్లైసెస్ మరియు కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఆవు పాలు( Cows milk ) పోసుకోవాలి.పాలు కాస్త హీట్ అవ్వగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమంతో పాటు చిటికెడు కుంకుమ పువ్వు( Saffron flower ), చిటికెడు జాజికాయ( nutmeg ) తురుము వేసుకొని కనీసం 10 నుంచి 12 నిమిషాల పాటు మరిగించాలి.

Advertisement

చివరిలో రెండు టేబుల్ స్పూన్లు బెల్లం తురుము( jaggery ) కూడా వేసి మరో రెండు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ట‌ర్మ‌రిక్ బాదం మిల్క్ ( Almond milk )రెడీ అవుతుంది.వేడివేడిగా ఈ డ్రింక్ సర్వ చేసుకుని తీసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి.

ముఖ్యంగా ఈ డ్రింక్ లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.

అవి జలుబు దగ్గు మంటి సమస్యల‌కు వ్య‌తిరేఖంగా పోరాడ‌తాయి.వారిటి త‌రిమి త‌రిమి కొడ‌తాయి.అలాగే నిత్యం ఈ టర్మరిక్ బాదం మిల్క్ ను తాగడం వల్ల మోకాళ్ళ నొప్పులు దూరం అవుతాయి.

మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది.ఒత్తిడి డిప్రెషన్ వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మ‌రియు కొలెస్ట్రాల్ సైతం క‌రుగుతుంది.

Advertisement

తాజా వార్తలు