అదిరిపోయే లుక్ లో మోక్షజ్ఞ.. వైరల్ అవుతున్న ఫోటోషూట్ వీడియో?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు బాలకృష్ణ ( Balakrishna ) వరుస సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలయ్య త్వరలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇలా తన సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నప్పటికి బాలయ్య అభిమానులు మాత్రం ఓ విషయంలో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కానీ బాలయ్య వారసుడు మాత్రం హీరోగా ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి మోక్షజ్ఞ( Mokshagna ) సినిమా ఇండస్ట్రీలోకి వస్తారని గత మూడు సంవత్సరాలుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇక బాలయ్య కూడా పలు సందర్భాలలో మోక్షజ్ఞ సినిమాలలోకి వస్తారని చెప్పారు.కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు కానీ మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి అన్ని చర్చలు జరిగాయని త్వరలోనే అధికారికంగా వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.

ఇక ఒకప్పుడు మోక్షజ్ఞ అధిక శరీర బరువుతో ఉండడంతో ఈయన హీరో మెటీరియల్ కాదు అంటూ పలువురు ఈయనపై నెగటివ్ కామెంట్లు కూడా చేశారు.అయితే తాజాగా మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.ఇటీవల ఈయన స్లిమ్ లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే.

Advertisement

తాజాగా ఈ ఫోటోషూట్ కి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది.ఎల్లో కలర్ టీ షర్టులో కిరాక్ లుక్ లో మోక్షజ్ఞ అదిరిపోయారని చెప్పాలి.

ఇక సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ ఇవ్వడం కోసం హీరోగా పర్ఫెక్ట్ గా ఉన్నారని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.ప్రశాంత్ వర్మ ( Prashanth Varma ) డైరెక్షన్లో మోక్షజ్ఞ ఇండస్ట్రీకి లాంచ్ కాబోతున్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు