మోహన్ లాల్ ని మళ్ళీ తీసుకొస్తున్న కొరటాల

మలయాళీ స్టార్ హీరోగా మోహన్ లాల్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.

ఓ వైపు కమర్షియల్ కథలు, మరో వైపు కంటెంట్ బేస్ డిఫరెంట్ కథాంశం ఉన్న సినిమాలు చేస్తూముందుకి వెళ్తున్నారు.

అయితే అతని బ్రాండ్ ఇమేజ్ కేవలం మలయాళంకి మాత్రమే పరిమితం కాకుండా తెలుగు, తమిళ బాషలలో కూడా సినిమాలు చేస్తున్నారు.అయితే ఎప్పుడో నిప్పురవ్వ సినిమాలో ఒక పాటలో కనిపించిన మోహన్ లాల్ తరువాత కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చారు.

Mohan Lal Again Ready To Work With Koratala, Tollywood, South Cinema, Acharya Mo

ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు మోహన్ లాల్ కి మంచి పేరు తీసుకొచ్చింది.తరువాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మనమంతా అనే సినిమాలో మోహన్ లాల్ నటించారు.

ఈ సినిమా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.తరువాత మళ్ళీ తెలుగు సినిమాలో మోహన్ లాల్ కనిపించలేదు.

Advertisement

వరుసగా మలయాళీ సినిమాలు చేస్తూ ఉండటం వలన తెలుగులో నటించే ప్రయత్నం చేయలేదు.అయితే మరల కొరటాలనే మోహన్ లాల్ ని తెలుగులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది.

ఆచార్య సినిమా తర్వాత కొరటాల శివ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఆచార్య రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు.

వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథాంశం ఉండబోతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవర్ ఫుల్ ముఖ్యమంత్రి పాత్ర కోసం మోహన్ లాల్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

జనతా గ్యారేజ్ సినిమా చేసిన నమ్మకంతో కొరటాల అడగగానే మోహన్ లాల్ ఈ సినిమాలో నటించడానికి ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.

మృతకణాలను పోగొట్టి మృదువైన చర్మాన్ని అందించే ఉత్తమ చిట్కాలు ఇవి!
Advertisement

తాజా వార్తలు