మోహన్ బాబు సపోర్ట్ విష్ణు కే అంటున్నాడు ఇందులో ఎంత నిజం ఉంది..?

కొద్ది రోజుల క్రితం మోహన్ బాబు( Mohan Babu ) కొడుకులు అంటే ఇద్దరు ఒక్క మాట మీద ఉండి కలిసి మెలిసి ఉండేవాళ్ళు.

మనోజ్ మొదటి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న తరువాత చాలా రోజుల పాటు ఒంటరి గా ఉన్నాడు.

ఇక చాలా సంవత్సరాల తర్వాత ఇటీవలే మనోజ్ భూమా మౌనికరెడ్డిని పెళ్లి చేసుకున్నాడు.అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజులకే అన్నదమ్ముల మధ్య గొడవలు బయట పడ్డాయి.

మనోజ్( Manoj ) సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు ఆ తరువాత కొద్ది సేపటికే పోస్ట్ ను డిలీట్ చేశాడు.ఆ తర్వాత విష్ణుకు తనకు మధ్య జరిగిన వివాదంపై మాత్రం స్పందించడానికి మనోజ్ ఇష్టపడలేదు.

ఇదే సమయంలో అన్నదమ్ములను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి .అన్నదమ్ముల గొడవ విషయం గురించి మీడియా ప్రశ్నించగా.అది మీ మీడియాకే తెలియాలని తెలివిగా సమాధానం చెప్పి మనోజ్ తప్పించుకున్నాడు .అయితే ఇప్పటికీ వీళ్ళ మధ్య లో లోపల ఏదో ఇన్నర్ వార్ జరుగుతుందని.ఆ కారణంగానే మోహన్ బాబు ఈ ఇష్యూ లో సైలెంట్ అయిపోయారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
Mohan Babu Supports Vishnu Kay Says How Much Truth Is There In This , Mohan Babu

ఇదే సమయంలో గతంలో మోహన్ బాబు మాట్లాడిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో మోహన్ బాబు తన సపోర్టు విష్ణుకే అని చెప్పేశాడు.

ఈ వీడియో ఇప్పటిది కాదు .ఎప్పుడో సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ తొలి సీజన్ లోది.

Mohan Babu Supports Vishnu Kay Says How Much Truth Is There In This , Mohan Babu

అప్పట్లో విష్ణు , మనోజ్( Vishnu, Manoj ) వేరు వేరు టీమ్స్ లో సభ్యులుగా ఉన్నారు.ఈ క్రమంలోనే విష్ణు బాగా ఆడింది .మనోజ్ టీం సరిగా ఆడలేకపోయింది .ఇదే విషయాన్ని మోహన్ బాబు కూడా చెప్పుకొచ్చాడు.నేను న్యాయం వైపే నిలబడతాను ఎవరి సైడ్ ధర్మం ఉంటే వారిని సపోర్ట్ చేస్తాను.

నిజంగా కష్టపడి ఆడింది విష్ణు టీం అందుకే వాళ్ల కి సపోర్ట్ చేస్తున్నాను .మనోజ్ టీంకి కాదు అంటూ ఓపెన్ గా చెప్పుకోచ్చారు.ఇదే వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు ట్రెండ్ చేస్తున్నారు .దీంతో మరోసారి మంచు ఫ్యామిలీ లోని గొడవలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరోవైపు ఇద్దరు అన్నదమ్ములు స్పందించి మ్యాటర్ ని కూల్ గా సాల్వ్ చేసుకున్నారని అంటున్నారు.

Mohan Babu Supports Vishnu Kay Says How Much Truth Is There In This , Mohan Babu
అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

ఇక మంచు మనోజ్ రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) బర్త్ డే వేడుకల్లో మెరిసారు.భార్యతో కలిపి ఈ ఫంక్షన్ కి అటెండ్ అయ్యాడు అంతేకాదు వీళ్ళిద్దరితోపాటు మంచు లక్ష్మి కూడా పార్టీకి రావడం సంచలనంగా మారింది.గత కొంతకాలంగా మోహన్ బాబుకు మెగాస్టార్ ఫ్యామిలీకు మధ్య గొడవ జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

Advertisement

అయితే ఈ ఫంక్షన్ కి మంచు మనోజ్ భార్యతో సహా రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

తాజా వార్తలు