విలన్ గా , క్యారక్టర్ ఆర్టిస్టుగా మరియు హీరోగా ఇలా అన్నీ విభాగాల్లో శబాష్ అనిపించుకున్న నటుడు మోహన్ బాబు( Mohan babu ).
టాలీవుడ్ లో ఉన్న అతి తక్కువ మంది లెజెండ్స్ లో ఈయన కూడా ఒకడు అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కానీ రీసెంట్ గా ఈయనకి ఉన్న మార్కెట్ మొత్తం కొత్త హీరోల రాక వల్ల పోయిన సంగతి తెలిసిందే.ఆయన చిత్రాలకు ఇప్పుడు కనీసం కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడం కూడా చాలా కష్టం అన్నట్టుగా తయారు అయ్యింది పరిస్థితి.
కనీసం కొడుకులు లేజసి ని కొనసాగిస్తారేమో అని భావిస్తే, వాళ్ళు కూడా ఇండస్ట్రీ లో సక్సెస్ కాలేకపోయారు.రెండవ కొడుకు మనోజ్ కి కాస్తో కూస్తో కొద్దిగా మార్కెట్ ఉన్నప్పటికీ, మొదటి కొడుకు మంచు విష్ణు( Manchu vishnu ) మార్కెట్ పరిస్థితి మాత్రం దారుణం అనే చెప్పాలి.
ఆయన నుండి విడుదలైన లేటెస్ట్ చిత్రం జిన్నా కనీసం కోటి రూపాయిల గ్రాస్ ని ఫుల్ రన్ లో కూడా రాబట్టలేకపోయింది.
ఇక గత ఏడాది మంచు మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా( Son of india ) చిత్రం పరిస్థితి కూడా ఇంతే.ఇలా మంచు హీరోల సినిమాలకు మార్కెట్ పూర్తిగా పోయినప్పటికీ కూడా, మంచు విష్ణు త్వరలోనే ఒక సరికొత్త రిస్క్ చెయ్యబోతున్నాడు.మోహన్ బాబు ని హీరో గా పెట్టి, సుమారుగా 100 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో త్వరలోనే ఒక సినిమా తియ్యబోతున్నాడట.
మీరు వింటున్నది నిజమే!, ఈ విషయాన్నీ స్వయంగా మోహన్ బాబు మీడియా కి తెలిపాడు.ఆయన స్థాపించిన విద్యానికేతన్ అనే స్కూల్ , చిన్నగా డెవలప్ అయ్యి నేడు విశ్వవిద్యాలయం గా ఎదిగిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ విద్యానికేతన్ విద్య సంస్థల గురించే ఈ చిత్రం ఉండబోతుందట.ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్టు సమాచారం.టాలీవుడ్ లో మార్కెట్ పూర్తిగా కోల్పోయినప్పటికీ ఇంత బడ్జెట్ పెట్టడం ఎందుకు , డబ్బులు అంత ఎక్కువగా ఉంటే వేరే ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా అని కొంతమంది నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.
అయితే కొంతమంది విశ్లేషకులు మోహన్ బాబు ఇంకా తనని తాను పెద్ద స్టార్ హీరో స్టేటస్ లోనే ఉన్నాడని అనుకుంటున్నాడని, ఆయనకీ వాస్తవం తెలియక డబ్బులను నష్టపోతున్నాడని అంటున్నారు.కనీసం రెండు కోట్ల రూపాయిల స్థిరమైన మార్కెట్ కూడా లేని మోహన్ ని పెట్టి ఇంత పెద్ద బడ్జెట్ నిజంగానే పెడుతున్నారా, లేదా సినిమాకి హైప్ రావడం కోసం అలా చెప్తున్నారు అని అందరూ అనుకుంటున్నారు.ఎందుకంటే గతం లో మోహన్ బాబు హైప్ కోసం ఇలాంటిదే ఒకటి చెప్పాడు.
సన్ ఆఫ్ ఇండియా చిత్రం లో వచ్చే ఒక పాట కోసం 8 కోట్ల రూపాయిల బడ్జెట్ పెట్టారట.ఈ విషయాన్నీ మోహన్ బాబు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పుకొచ్చాడు.కానీ తీరా ప్రేక్షకులు ఆ పాట ని యూట్యూబ్ లో చూసి నవ్వుకున్నారు.8 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తీసిన పాట , ఇంత చీప్ క్వాలిటీ తో ఉంటుందా అని సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రోల్ల్స్ వేశారు.ఇప్పుడు తన కొత్త సినిమాకి వంద కోట్ల రూపాయిల బడ్జెట్ అని మోహన్ బాబు చెప్తున్న మాటలు కూడా అలాంటివే అని అంటున్నారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy