నేడు విచారణకు ఎమ్మెల్యే రాజాసింగ్ కేసు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేసు విచారణ నేడు జరగనుంది.రాజాసింగ్ కేసును పీడీయాక్ట్ అడ్వైజరీ కమిటీ విచారించనుంది.

కాగా ఈ విచారణలో రాజాసింగ్ వర్చువల్ గా పాల్గొననున్నారు.మరోవైపు అడ్వైజరీ బోర్డు ముందు రాజాసింగ్ కుటుంబ సభ్యులు వాదనలు వినిపించనున్నారు.

పీడీ యాక్ట్ కింద పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేయగా.ఆగస్ట్ 25 నుంచి జైలులోనే ఉన్నారు.

ఇప్పటికే రాజాసింగ్ భార్య ఉషాబాయి తన భర్తను కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని, ప్రాణాలకు ముప్పు ఉందని గవర్నర్ ను, తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Advertisement
Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players