టీడీపీ లో వీధికెక్కిన వర్గపోరు ! జేసీ వర్సెస్ చౌదరి

అసలే ఫ్యాక్షన్ తగాదాలతో హీటెక్కిపోయి ఉండే అనంతపురం జిల్లాలో టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నాయకుల మధ్య గత కొంతకాలంగా ఏర్పడిన గ్రూపు తగాదాలు చిలికి చిలికి గాలివానలా మారాయి.

తాజాగా.

ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి నిప్పులు చెరిగారు.తనపై అవాకులు, చవాకులు పేలితే సహించేది లేదని స్పష్టం చేశారు.

జేసీ దివాకర్‌ రెడ్డి అక్రమాల చిట్టా తన వద్ద ఉందని హెచ్చరించారు.అనంతపురం లలితా కళా పరిషత్‌లో ఆదివారం జరిగిన బీసీ సదస్సులో ప్రభాకర్‌ చౌదరి మాట్లాడుతూ.

రాంనగర్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి ప్రారంభానికి జేసీ సిద్ధమవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు.కాంట్రాక్టర్‌గా పనులు చేసినంత మాత్రానా అన్నిహక్కులు వస్తాయా? అని ప్రశ్నించారు.

Advertisement

పీస్‌ మెమొరియల్‌ హాల్‌కు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పేరు పెడితే జేసీ దివాకర్‌ రెడ్డికి ఎందుకంత కడుపు మంట? అని మండిపడ్డారు.తన ఓపికను పరీక్షించొద్దని జేసీపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని ఆయన మండిపడ్డారు.ఇక అనంతపురంలో ప్రారంభానికి సిద్దంగా ఉన్న రాంనగర్‌ బ్రిడ్జి విషయంలోనే ఈ ఇద్దరి నేతల మధ్య వివాదం నెలకొంది.

ఈ బ్రిడ్జిని ప్రారంభించేందుకు జేసీ సిద్దమవుతున్నారని ప్రభాకర్‌ చౌదరి అనుమానిస్తున్నారు.ఈనేపథ్యంలోనే జేసీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు