కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. గట్టు దాటినట్టేనా..?

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలం రేపుతున్నాయి.ఇన్నాళ్లు వైసీపీ కి నమ్మిన బంటు లా కనిపించిన అయన.

ఇప్పురు వ్యతిరేకంగా మారారు.ఎమ్మెల్యే గా గెలిచిన దగ్గరి నుంచి పార్టీలో యాక్టిివ్ గా ఉంటూ వచ్చారు.

రెండో సారి మంత్రి వర్గ విస్తరణ జరిగే టైమ్ లో మంత్రి పదవి కోసం చాలా ట్రై చేశారు.అయితే అది లాస్ట్ మినిట్ లో కాకాని గోవర్ధన్ రెడ్డి నీ వరించింది.

దాంతో ఆయనకు టీడీపీ వల వేసినట్టు తెలుస్తోంది.మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు చెక్ పెట్టాలంటే అక్కడ స్థానికంగా ఉన్న నేతను పట్టాలని టీడీపీ చూస్తోంది.

Advertisement

మంత్రి వర్గ విస్తరణ భగ్యమా అని.కోటంరెడ్డి దొరికారు.దాంతో కోటంరెడ్డి కి మంత్రి పదవి ఆఫర్ తో పాటు టీడీపీలో టికెట్ కన్ఫర్మ్ అయిపొయింది.

దాంతో ఆయన తన అనుచరులతో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.అదికాస్తా ఆ నోటా ఈ నోటా.

వైసీపీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో కోటంరెడ్డి పై నిగా పెరిగింది.

అంతేకాకుండా ఏకంగా కోటంరెడ్డి మాట్లాడిన ఒక ఆడియో ఇప్పుడు బయటకు వచ్చింది.అయితే ఇది అయన ఇమేజ్ ను దెబ్బతీయడానికి ప్రత్యర్థులు తెచ్చిందా.? లేక ఆయన్ను పార్టీలోనుంచి సాగనంపేందుకు అధికార పార్టీ పన్నిన పన్నాగమా అని విశ్లేషకులు ఆలోచిస్తూ ఉన్నారు.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

ఎన్నికలకు సంవత్సరం ముందు నుంచే వైసీపీ 175 ను టార్గెట్ గా పెట్టుకుంది.అందులో భాగంగా నే కేవలం గెలుపు గుర్రాలకు టికెట్ల ఇవ్వాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.నియోజకవర్గం లో వెనుకబడిన నేతలతో పాటు.

Advertisement

వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యే లను పక్కన పెడుతున్నట్టు తెలుస్తోంది.అందులో భాగంగానే అటు ఆనం ను ఇటు కొరం రెడ్డి నీ సాగనంపే ప్రయత్నం చేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

ఆడియో లో ఉన్నట్టు నిజంగా కోటమ్ రెడ్డి పార్టీ మారుతార.? లేక అధిష్టానం.బుజ్జగింపులు లొంగుతారా చూడాలి.

తాజా వార్తలు