ములుగు జిల్లా వెంకటాపురంలో తప్పిన ప్రమాదం

ములుగు జిల్లా వెంకటాపురంలో పెను ప్రమాదం తప్పింది.బస్సు డ్రైవర్ కు గుండెపోటు రావడంతో అదుపుతప్పిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతిచెందగా.40 మంది యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు.యాదగిరి గుట్ట నుంచి భద్రాచలం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

కాగా ప్రయాణికులు ఏపీలోని చిత్తూరు జిల్లా కాణిపాకం వాసులుగా గుర్తించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆ విషయంలో ఫహాధ్ ఫాజిల్,రాజ్ కుమార్ రావ్ ఫాలో అవుతున్న రాగ్ మయూర్?

తాజా వార్తలు