ఆ వ‌ర్గం కింద ముగ్గురికి మంత్రి బెర్త్ ! వైసీపీ వ‌ర్గాల్లోచ‌ర్చ !

ఏపీ సీఎం జ‌గ‌న్ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ప‌నులు ష‌ర‌వేగంగా సాగుతున్నాయి.ఇదే రీతిలో వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు కూడా సాగుతున్నాయి.

రెండున్న‌రేండ్ల త‌రువాత మంత్రివ‌ర్గాన్ని మారుస్తాన‌ని జ‌గ‌న్ చెప్పిన విష‌యం విధిత‌మే.మొత్తంగా ఏప్రిల్ 11న ఆయ‌న కొత్త మంత్రి వ‌ర్గాన్ని ప్ర‌క‌టిస్తార‌ని టాక్‌.

ఇప్ప‌టికే కొత్త మంత్రుల జాబితా ఫైన‌లైజ్ చేశార‌ని తెలిసింది.పాత‌మంత్రి వ‌ర్గంలో దాదాపు 90శాతంమందిపై వేటుప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని వైసీపీ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

అయితే కొత్త మంత్రుల జాబితాపై తాడేప‌ల్లిలో స‌మాచారం లీక్ అయిన‌ట్టు స‌మాచారం.కొత్త‌గా రెడ్డి స‌మాజిక వ‌ర్గానికి చెందిన ముగ్గురికి మాత్ర‌మే ప‌ద‌వులు ఇస్తున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

ఇందులో ఆర్కే రోజాతోపాటు రామ‌కృష్ణారెడ్డి, న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న కుమార్‌రెడ్డి అని తెలిసింది.వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే లక్ష్యంగా ప్ర‌స్తుత మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌.

దీంతో ఆయ‌న స్థానంలో రోజాకు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని పేర్కొంటున్నారు. జ‌గ‌న్‌కు విధేయురాలిగా వ‌స్తున్న ఆమెకు తొలి ఛాన్స్ ఇస్తార‌ని అనుకున్నా ప‌ద‌వి రోజాకు ఇవ్వ‌లేదు.

ఇప్పుడు క‌చ్చితంగా మ‌హిళ‌ల కోటా చూసుకున్నా రోజా మంత్రి కావ‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో లోకేష్ మీద గెలిచిన రామకృష్ణారెడ్డిపై జ‌గ‌న్‌కు మంచి అభిప్రాయం ఉంది.నాడు ఎన్నిక‌ల ప్ర‌చార‌మ‌ప్పుడు రామ‌కృష్ణ గెలిస్తే మంత్రిని చేస్తాన‌ని జ‌గ‌న్ హామీ కూడా ఇచ్చారు.దీంతో ఆ హామీని నిల‌బెట్టుకుంటార‌ని టాక్‌.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి

మ‌రోవైపు ఇటీవ‌ల మృతిచెందిన మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి స్థానంలో అదే జిల్లాకు చెందిన న‌ల్పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డికి స్థానం ఇచ్చే ఛాన్స్ ఉంది.ఈయ‌న‌కు మంత్రి బెర్త్ ఖరారైన‌ట్టు టాక్‌.

Advertisement

ఇక సీఎం జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో వీరికి నిజంగా అవ‌కాశం ద‌క్కుతుందా ? లేదా ? ఇంకా ఏమైనా మంత్రివ‌ర్గంలో కొత్త మార్పులు చోటుచేసుకుంటాయా ? అన్న‌ది వేచి చూడాలి.

తాజా వార్తలు