Minister Uttam Kumar Reddy : బీఆర్ఎస్ పార్టీ కారు టైర్లు పంచర్ అయ్యాయి..: మంత్రి ఉత్తమ్

తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ పార్టీ కారు టైర్లు పంచర్ అయ్యాయని ఎద్దేవా చేశారు.

గత కొన్ని రోజులుగా ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) హాస్యాస్పదంగా వ్యవహారిస్తోందని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేటీఆర్( KTR ) సలహాలు సిల్లీగా ఉన్నాయన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరంపై మాజీ సీఎం కేసీఆర్( Former CM KCR ) దిగజారిన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.

ఆరోగ్యంగా బరువు పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి చాలు!
Advertisement

తాజా వార్తలు