సీఎం కేసీఆర్ కి పాలమూరు ప్రోగ్రెస్ రిపోర్ట్ అందజేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

ఆ తర్వాత ఇంటిలోనే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్న సంగతి తెలిసిందే.అనారోగ్యం కారణంగా చాలావరకు ప్రగతి భవన్ ( Pragati Bhavan )కే పరిమితమై అధికారిక కార్యక్రమాలకు కూడా పాల్గొనడం లేదు.

Minister Srinivas Goud Handed Over Palamuru Progress Report To CM KCR , Minister

అయితే గత రెండు రోజుల నుండి కోలుకుంటున్నా కేసీఆర్ చాలా రోజుల తర్వాత ప్రగతి భవన్ లో కేటీఆర్, హరీష్ రావులతో( KTR , Harish Rao ) సమావేశమయ్యారు.ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో జరగబోయే ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడం జరిగింది.

ఆల్రెడీ జరగబోయే ఎన్నికలలో పోటీ చేసే 115 మంది అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించడం జరిగింది.ఇదిలా ఉంటే అనారోగ్యం నుంచి కోలుకున్న కేసీఆర్ నీ గురువారం సాయంత్రం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలవడం జరిగింది.

Advertisement

ఈ సందర్భంగా పాలమూరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ముఖ్యమంత్రికి అందజేశారు.ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలలో కేసీఆర్ ఆరోగ్యంగా కనిపించడం జరిగింది.

ఇదిలా ఉంటే అక్టోబర్ 15వ తారీకు హుస్నాబాద్ నుంచి ప్రచారం చేయటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు