ఆర్థిక ఇబ్బందులతోనే మంత్రి సబితా ఎస్కార్డ్ ఆఫీసర్ బలవన్మరణం

తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్డ్ ఆఫీసర్ ఫజల్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తేల్చారు.

మృతుడు ఫజల్ పలు బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారని పోలీసులు గుర్తించారు.ఈ క్రమంలోనే లోన్ రికవరీ వేధింపులు తాళలేక గన్ తో ఫైర్ చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మరోవైపు ఫజల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement