సోలార్ ట్రాక్టర్ ను ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ..

CANORX (కానోరెక్స్) మోటార్స్ ప్రయివేట్ లిమిటెడ్ స్టార్ట్ అప్ కంపెనీ వారు రూపొందించిన సోలార్ మరియు కరెంట్ ట్రాక్టర్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆవిష్కరించారు.

ఈ రోజు ప్రపంచ విద్యుత్ వాహనాల దినోత్సవం సందర్భంగా ఆయా వాహనాన్ని ప్రారంభించినట్లు కంపెనీ చైర్మన్ రాము బానోత్ పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్ రంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని మంత్రి పువ్వాడ వివరించారు.ఖమ్మంలోనే ఇలాంటి ఆవిష్కరణ జరగడం సంతోషకరమైన విషయమని, ఇలాంటి మరిన్ని ఆవిష్కరణలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

కార్యక్రమంలో నాయకులు RJC కృష్ణ గారు, CANORX చైర్మన్ రాము బాణోత్, మానేజింగ్ డైరెక్టర్ కళావతి రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Latest News - Telugu News