వైయస్ జగన్ పై మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు..!!

ఇటీవల ఏపీలో కొలువుదీరిన చంద్రబాబు( Chandrababu ) ప్రభుత్వం త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది.ఇప్పటికే మంత్రులకు శాఖలు కేటాయించటం జరిగింది.

అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే రావడం జరిగింది.దీంతో వైసీపీ( YCP ) పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.

ఇటీవల ఓటమి చెందిన నాయకులతో సమావేశమవుతున్న వైయస్ జగన్ సైతం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు అంటూ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.సో ఇటువంటి పరిస్థితులలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ( Minister Payyavula Keshav )ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వైయస్ జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.

Advertisement

సభ అర్థవంతంగా సజావుగా జరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.తమ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తామని వ్యాఖ్యానించారు.సంపాద సృష్టి పేరుతో పన్నులు వేయబోమని పయ్యావుల స్పష్టం చేశారు.

చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఉపయోగించుకుని రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు మరియు ఐటి కంపెనీలు తీసుకొస్తామని వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో రాష్ట్ర ఖజానా ఎలా ఉందో చూడాల్సి ఉందని అన్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధుల మళ్లింపు మరియు భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టుపెట్టి అప్పు తీసుకురావటం ఇంకా అనేక అవకతవకలు గుర్తించినట్లు పేర్కొన్నారు.ఈ మేరకు కాగ్ కూడా నివేదిక ఇచ్చిందని మంత్రి పయ్యావుల వెల్లడించారు.

అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?
Advertisement

తాజా వార్తలు