నిరుద్యోగులకు లోకేష్ చెప్పబోయే శుభవార్త ఇదేనా ? 

నేడు ఏపీలోని నిరుద్యోగులకు( Unemployed ) ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది.

దీనికి సంబంధించి ఏపీ మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ) ట్వీట్ చేశారు.

రేపు శుభవార్త వినబోతున్నారంటూ ఆయన నిరుద్యోగుల్లో ఉత్సాహం రేకెత్తించారు .దీంతో ప్రభుత్వం చెప్పబోయే శుభవార్త ఏమిటనే దానిపై నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే వివిధ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు టిసిఎస్ కంపెనీ( TCS Company ) ఏపీలో ఏర్పాటు కాబోతున్న వార్తను ఈరోజు లోకేష్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

లోకేష్ లేదా చంద్రబాబు ఈ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.నిన్ననే టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ తో మంత్రి నారా లోకేష్ సమావేశం అయ్యారు.

దీంతో టాటా గ్రూప్ నుంచి ఈరోజు ఆ న్యూస్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఏపీలో టాటా గ్రూప్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారనే విషయాన్ని లోకేష్ కానీ చంద్రబాబు కానీ ప్రకటించే అవకాశం ఉంది.టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ తో( Natarajan Chandrashekar ) జరిగిన సమావేశం సానుకూలంగా జరిగిందని లోకేష్ ట్వీట్ ద్వారా తెలియజేయడంతో , ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Advertisement

ఏపీలో పెట్టుబడుల అన్వేషణ కోసం ఏర్పాటుచేసిన టాస్క్ ఫోర్స్ కు కో కన్వీనర్ గా టాటా గ్రూపుల చైర్మన్ వ్యవహరించాలని గతంలోనే ప్రభుత్వం కోరింది .దీనికి ఆయన అంగీకారం కూడా తెలపడం జరిగింది.అమరావతిలో సెంటర్ ఫర్ గ్లోబల్ నెస్ ను ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్ అంగీకారం తెలిపినట్లు గతంలోనే ప్రచారం జరిగింది.

అలాగే విశాఖపట్నంలో టిసిఎస్ డెస్టినేషన్ సెంటర్ పైన కూడా ఈరోజు ప్రకటన వెలువడే అవకాశం ఉంది .దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగ , ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.ఈ శుభవార్తనే లోకేష్ గాని ,చంద్రబాబు గాని ఈరోజు ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు