బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి కే టీ ర్ కౌంటర్

కేసీఆర్‌ క్షుద్రపూజలు చేస్తారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు.

సంజయ్‌ను ఇలాగే వదిలెయ్యకండి భాజపా బాబులు అంటూ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడని పేర్కొన్నారు.పిచ్చి ముదిరి తొందరలో కరవడం కూడా మొదలు పెడతారేమో.

ఎర్రగడ్డలో ఆయన కోసం బెడ్‌ తయారుగా ఉందని ఎద్దేవా చేశారు.తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి అని భాజపా నేతలకు కేటీఆర్‌ సూచించారు.

Advertisement