వరద బాధిత ప్రాంతాలకు మంత్రి కేటీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముంపు ప్రాంతాల ప్రజలను తరలించి సహాయక చర్యలు తీసుకుంటోంది.

కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతి పెరగడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టింది.

తెలంగాణలో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో వరద ముంచెత్తుతోంది.దీంతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి ఈటలె రాజేందర్ తో కలిసి మంగళవారం పర్యటించారు.

హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో వరంగల్ కు బయలు దేరనున్నారు.వరంగల్ చేరుకున్నాక అక్కడి ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి, అధికారులతో, పార్టీ నేతలతో సమావేశమవుతారు.

Advertisement

వరంగల్ లో ఉన్న నిట్ లో ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారని సమాచారం.వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఇప్పటికే ఆదేశించారు.

మరో రెండు రోజుల వరకు భారీ వర్షాలు కొనసాగే సూచనలు ఉన్నాయని, ముంపు ప్రాంతాల ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు.లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలకు అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్లకు ఫోన్ చేసి సమాచారం అందించారు.

ఈ మేరకు సీఎం కేసీఆర్ సోమవారం వరంగల్ వరద ఉధృతిపై సమీక్ష నిర్వహించారు.జిల్లాలో చేపట్టిన సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?
Advertisement

తాజా వార్తలు