తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ ఫైర్

తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారని ప్రశ్నించారు.

తెలంగాణ సొమ్ముతో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ సోకులు పడుతుందని ఎద్దేవా చేశారు.దేశ అభివృద్ధికి దోహద పడుతున్నందుకు ధన్యవాదాలు చెప్పాలన్నారు.

రాష్ట్రానికి చెందిన ఒక్క బీజేపీ జోకర్ కు కూడా కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించి అడిగే దమ్ము, ధైర్యం లేవని విమర్శించారు.కానీ గుజరాతీ బాస్ ల చెప్పులు మోయడానికి రెడీగా ఉంటారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, ఆదివారం 2023
Advertisement