కాంగ్రెస్ డిక్లరేషన్ పై మంత్రి హరీశ్ రావు సెటైర్లు

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో దివ్యాంగుల ఆత్మ గౌరవం పెంచారని మంత్రి హరీశ్ రావు అన్నారు.

గృహాలక్ష్మీ పథకంలోనూ దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించామని తెలిపారు.

బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.వెయ్యికి మించి పెన్షన్ ఇవ్వడం లేదని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.జిల్లాల్లో 167 మంది జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులర్ చేస్తున్నామని వెల్లడించారు.

కాంగ్రెస్ హయాంలో ఐదు గ్రామాలకు ఒక సెక్రటరీ ఉండేవారని పేర్కొన్నారు.పంచాయతీ సెక్రటరీలు నూతన ఉత్తేజంతో ముందుకు సాగాలని సూచించారు.

అనంతరం కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్ పై సెటైర్లు వేశారు.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అనేది కల మాత్రమేనని పేర్కొన్నారు.

Advertisement

కాంగ్రెస్ నేతలు డిక్లరేషన్ మీద డిక్లరేషన్ ప్రకటిస్తున్నారని విమర్శించారు.ఈక్రమంలోనే కాంగ్రెస్ డిక్లరేషన్ ను ముందు కర్ణాటకలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement