వాలంటీర్ వ్యవస్థపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు( Chandrababu ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఒకపక్క ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరోపక్క పాలనపరంగా ప్రక్షాళన చేసే దిశగా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లను మార్చడం జరిగింది.

ఇదిలా ఉంటే వైసీపీ( YCP ) ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం తెలిసిందే.వైయస్ జగన్( YS Jagan ) హయాంలో వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంది.

పెన్షన్ల పంపిణీ ఇంకా అనేక ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడంలో వాలంటీర్లు కీలకపాత్ర పోషించే వాళ్ళు.

Advertisement

అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ల విషయంలో సందిగ్ధత నెలకొంది.పరిస్థితి ఇలా ఉండగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి( Minister Anam Ramanaraya Reddy ) వాలంటీర్ వ్యవస్థ పై శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.వాలంటరీ వ్యవస్థ ఉండొచ్చు ఉండకపోవచ్చు.

అని వ్యాఖ్యానించారు.గతంలో ఇచ్చే విధానానికి భిన్నంగా జులై 1 నుంచి పెన్షన్లు అందించబోతున్నాం.

ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తించబడిన సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికి పెన్షన్లు అందిస్తాం.వాలంటీర్ల వ్యవస్థను పెన్షన్ల పంపిణీకి మేం ఉపయోగించుకోవడం లేదు.

రాజీనామా చేసిన వాలంటీర్లపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.

'డాకు మహారాజ్ ' సినిమా ట్రైలర్ లో బాబీ చేసిన తప్పు ఏంటో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు