ఎంఐఎం- కాంగ్రెస్ : కొత్త స్నేహం చిగురిస్తుందా?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు.

తన చివరి శ్వాస వరకు ఈ పార్టీలోనే కొనసాగుతానని చెప్పిన నేతలే ఆ మరుసటి రోజు వేరే పార్టీలోకి జంప్ అయిన ఉదంతాలు అనేకం నేటి రాజకీయాల్లో కనిపిస్తూనే ఉన్నాయి.

నిన్న మొన్నటి వరకు వ్యక్తిగత స్థాయికి తిట్టుకున్న నేతలు నేడు భుజం భుజం కలుపుకుంటూ కొత్త స్నేహాలు కలుపుకున్న ఉదంతాలు కూడా తక్కువేమీ కాదు.ఇప్పుడు టాపిక్ ఏమిటంటే ఎంఐఎం కాంగ్రెస్ల మధ్య కొత్తగా స్నేహం చిగురుస్తున్న సంకేతాలు కనిపించడం, ఈ రెండు పార్టీలు పార్లమెంట్ ఎన్నికలకు పొత్తు పెట్టుకుంటాయా అన్న అనుమానాలను కొంతమంది వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం .

గత పది సంవత్సరాలుగా అధికార భారతీయ రాష్ట్ర సమితి( BRS )కి నమ్మకమైన మిత్రుడుగా ఉన్న ఎంఐఎం ,పాతబస్తీ వరకు తన అధికారానికి తిరుగులేకుండా ఒప్పందం కుదుర్చుకొని సామంత రాజ్యం తరహా లో చలాయించింది.ముఖ్యంగా అసెంబ్లీలో అధికార పార్టీకి మద్దతుగా నిలవడంలో కానీ, గడిచిన ఎన్నికలలో బిఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చేలా కాంగ్రెస్ స్థానాలలో అభ్యర్థులను పోటీకి నిలపడం కానీ ఇలా అన్ని విషయాలలోనూ బి ఆర్ఎస్ కు చేదోడు వాదోడుగా నిలిచిన ఎంఐఎం, ఇప్పుడు అధికారం చేతులు మారడంతో స్నేహాన్ని కూడా ఇటు నుంచి అటు ఫిరాయించిన సంకేతాలు కనిపిస్తున్నాయట .

ముఖ్యంగా అక్బరుద్దీన్ ఓవైసీ( Akbaruddin Owaisi )ని ప్రోటెం స్పీకర్ గా కాంగ్రెస్ నిర్ణయించడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతుందట .అయితే అధికారంలో ఎవరు ఉన్నా పాత బస్తీ వరకు తమకు తిరుగులేని విధంగా చక్రం తిప్పడం ఎంఐఎం నేతలకు అలవాటు.అటు బిఆర్ఎస్ అయినా ఇటు కాంగ్రెస్ అయినా వారి ప్రధాన డిమాండ్ అదే అయ్యి ఉంటుంది.

Advertisement

పైగా కాంగ్రెస్( Congress ) ఎలాగో పాతమిత్రుడే కనుక ఇప్పుడు కొత్త షరతులతో మరోసారి స్నేహాన్ని అప్డేట్ చేసుకోవడానికి ఎంఐ ఎం చూస్తున్నట్లుగా తెలుస్తుంది.ఊహగాణాలే కనుక నిజమైతే మరో కొన్ని రోజుల్లో ఈ రెండు పార్టీల పొత్తుపై ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

ముఖ్యంగా ఒకటి రెండు సీట్లకు ఎంఐఎం ను పరిమితం చేసి మిగిలిన సీట్లకు ఆ పార్టీ మద్దతు తీసుకునేలా రేవంత్ చక్రం తిప్పవచ్చు అన్నది వినిపిస్తున్న విశ్లేషణల సారాంశం .ఏది ఏమైనా రోజుకొక కొత్త నిర్ణయం తీసుకుంటూ రేవంత్ మాత్రం రాజకీయం గా దూసుకుపోతున్నారు అని చెప్పవచ్చు .

Advertisement

తాజా వార్తలు