ఈ నాలుగు పనులు చేయకపోతే కంటికి ప్రమాదం

టెక్నాలజీ మన జీవితంలో వదులుకోలేని అవసరంగా మారింది.

ప్రోఫేషనల్ పనుల కోసం కావచ్చు, సమాచారం కోసం కావచ్చు, సరదా కోసం కావచ్చు, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ లేకుండా రోజు గడపటం కష్టమైపోయింది.

గంటలకొద్దీ కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ తో గడపాల్సి వస్తోంది.ఇలా ఎక్కువ సమయం కంప్యూటర్, మొబైల్ స్క్రీన్ ముందు ముఖం పెడితే, కంటిచూపుకి ప్రమాదం అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

ఈ సమస్యని కొన్ని పద్ధతుల ద్వారా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు.అవేంటంటే .* కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ నుంచి విడుదలయ్యే లైట్ నుంచి కంటిని సంరక్షించడానికి రకరకాల కంటి అద్దాలు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి.క్రిజల్ ప్రెవెన్షియా, ఐజెన్ లాంటి లెన్సెస్ మీ కంటిని బూల్ లైట్ తో పాటు యువి రేస్ నుంచి కాపాడడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి.

కాబట్టి ఖర్చుకి వెనుకాడకుండా, మీ కంటిని భవిష్యత్తు ప్రమాదల నుంచి కాపాడుకుంటే మంచిది.* తదేకంగా గంటల పాటు కంప్యూటర్ మీద గాని, స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టుకోని కాని కూర్చోకండి.

Advertisement

పనికోసం కాసేపు వాడారంటే, మరికాసేపు విశ్రాంతి తీసుకోండి.ఆఫీసులో నిద్ర సాధ్యపడదు కాబట్టి, ఓసారి బాత్రూమ్ కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవడం చేయాలి.

ఇంట్లో ఉంటే నిద్రలోకి కాసేపు జారుకోవడం ఉత్తమం.* ఎప్పుడూ కూడా సాంకేతిక పరికరాల్లో బ్రైట్ నెస్ ని సాధ్యమైనంత వరకు తక్కువగానే పెట్టుకోండి.

డై లైట్ లో సరిపడేంత బ్రైట్ నెస్ పెట్టుకొని, రాత్రిపూట అతితక్కువ బ్రైట్ నెస్ పెట్టుకోవాలి.* బెడ్ రూమ్ లో స్మార్ట్ ఫోన్ కాని కంప్యూటర్ కాని పెట్టుకోవద్దు.

మీరెంత కంట్రోల్ చేసుకున్నా, చేతులు మొబైల్ లేదా కంప్యూటర్ మీదకి వెళతాయి.రాత్రిపూట ఇవి వాడటం కనులకి ఏమాత్రం మంచిది కాదు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
మంగళ వారం ఈ పనులు చేస్తే ఏమి అవుతుందో తెలుసా?

రాత్రి అనేది కంటికి విశ్రాంతి ఇవ్వడం కోసం మాత్రమే.

Advertisement

తాజా వార్తలు