బంగాళదుంపలో గజ్జి తెగులును అరికట్టే పద్ధతులు..!

బంగాళదుంపను ( Potato )ఆశించే గజ్జి తెగులు వివిధ తెగులు సోకిన కణజాలాలలో జీవిస్తుంది.

మొక్కకు ఏవైనా గాయాలు అయినప్పుడు బ్యాక్టీరియా ద్వారా మొక్క ప్రవేశించి వ్యాప్తి చెందుతుంది.

గజ్జి తెగులు వ్యాప్తి చేసే బ్యాక్టీరియాకు ఆక్సిజన్ ఎక్కువగా అవసరం ఉంటుంది.కాబట్టి మట్టిలో కూడా ఈ బ్యాక్టీరియా జీవించి ఉంటుంది.

ఈ గజ్జి తెగులను గుర్తించడం చాలా కష్టం.ఎందుకంటే బంగాళదుంప మొక్క పై భాగాలపై ఈ గజ్జి తెగులకు సంబంధించిన ఎటువంటి లక్షణాలు కనిపించవు.

బంగాళాదుంపలపై గోధుమ రంగు కార్కు వంటి బుడిపెలు కనిపిస్తాయి.అంతేకాదు బంగాళాదుంపలపై లోతైన రంధ్రాలు మరియు జాలి వంటి పగుళ్లు కూడా ఏర్పడతాయి.

Advertisement
Methods To Prevent Scabies In Potato , Potato , Potato Crop, Farmers , Scabies

ఈ గజ్జి తెగుల వల్ల బంగాళా దుంప నాణ్యతను కోల్పోతుంది.

Methods To Prevent Scabies In Potato , Potato , Potato Crop, Farmers , Scabies

ఈ గజ్జి తెగులు సోకకుండా వ్యాధి నిరోధక విత్తనాలను మాత్రమే ఉపయోగించాలి.పొలంలో రెండు సంవత్సరాలకు ఓసారి పంట మార్పిడి చేయాలి.భూమిలో అధిక తడి లేకుండా జాగ్రత్త పడాలి.

నీటి తడులు అందిస్తున్న సమయంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యంగా భూమిలో పీహెచ్ స్థాయి తక్కువగా ఉండేలా సరైన ఎరువులు వాడాలి.

అంటే సల్ఫర్, జిప్సం, అమోనియా సల్ఫేట్ లు పీహెచ్ స్థాయిని తగ్గించడమే కాకుండా వివిధ రకాల తెగుల తీవ్రతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Methods To Prevent Scabies In Potato , Potato , Potato Crop, Farmers , Scabies

ముందుగా సేంద్రీయ పద్ధతి( Organic method )లో కంపోస్ట్ లేదా కంపోస్ట్ టీ ల మిశ్రమంతో ఈ తెగులను నివారించవచ్చు.జీవ సంబంధిత ఎరువుల ఉపయోగం అధికంగా ఉంటే బంగాళా దుంపల నాణ్యత మెరుగుగా ఉంటుంది.ఇక రసాయనిక పద్ధతిలో ఈ తెగులను నియంత్రించాలి అంటే బంగాళాదుంప విత్తనాలను ఫ్లుఅజినామ్, ఆక్సిటేట్రాసైక్లిన్ లేదా లేదా క్లోరోటారొల్ మరియు మాంకోజెబ్ లతో చికిత్స చేయడం వల్ల ఈ గజ్జి తెగులను పూర్తిగా అరికట్టవచ్చు.

Advertisement

తాజా వార్తలు