దానిమ్మలో పండు తొలుచు పురుగులను అరికట్టే పద్ధతులు..!

దానిమ్మ చెట్టు( Pomegranate tree ) లేత ఆకులపై, పూల మొగ్గలపై, దానిమ్మ పండ్లపై సీతాకోకచిలుకలు గుడ్లు పెడతాయి.

ఈ గుడ్ల లోపల నుంచి పురుగులు బయటకు వచ్చి దానిమ్మ పంటకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశిస్తాయి.

ఈ పురుగులు మొక్క యొక్క కణజాలాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.ఏడాదిలో సాధారణంగా జూలై నెలలో ఈ సీతాకోకచిలుక సంక్రమణ ( Butterfly infection )చాలా తీవ్రంగా ఉంటుంది.

ఈ పురుగులు పంటను ఆశించిన వెంటనే గుర్తించడం చాలా కష్టం.ఎందుకంటే ఈ పురుగులు ఆశించిన తర్వాత కూడా దానిమ్మ పండ్లు ఆరోగ్యంగానే కనిపిస్తాయి.

పండును రంద్రం చేసి లోపలికి ప్రవేశించి గుజ్జును అంతా ఆహారంగా తిన్న తర్వాత పండు కుళ్ళిపోయి రాలిపోతుంది.ఈ సీతాకోకచిలుక అనేది నీలి గోధుమ రంగులో ఉంటుంది.

Advertisement

మరి ఈ పురుగులను( Worms ) అరికట్టడం కోసం ముందుగా దానిమ్మ చెట్లకు ఉండే ఎండు కొమ్మలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.ఈ పురుగులను గుర్తించడం కోసం దానిమ్మ పంట తోటలో అక్కడక్కడ కాంతి ఉచ్చులు ఏర్పాటు చేయాలి.దెబ్బతిన్న దానిమ్మ పండ్లను ఎప్పటికప్పుడు తొలగించాలి.

కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి.దానిమ్మ పండు ఐదు సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్నప్పుడు 300 గేజ్ మందం ముస్లిన్ వస్త్రంతో బ్యాగు కట్టడంతో పురుగులు పండుకు రంధ్రం చేసే అవకాశం ఉండదు.

సేంద్రీయ పద్ధతిలో ఈ పండు తోలుచు పురుగులను అరికట్టాలంటే పరాన్న జీవి ట్రైకో గ్రామా జాతులను పంట పొలంలో ఎకరానికి లక్ష చొప్పున విడుదల చేయాలి.కందిరీగ జాతులు, పెద్ద కన్ను పురుగు, ఇయర్ విగ్, గ్రౌండ్ బిటల్, పెంటాటోమిడ్ పురుగులను పొలంలో వదలడం వల్ల పండు తొలుచు పురుగులను అరికట్టవచ్చు.రసాయన పద్ధతిలో ఈ పురుగులను అరికట్టాలంటే టాఫ్ గోర్, రో గోర్, అను గోర్, దర్ గోర్ లాంటి రసాయన పిచికారి మందులను ఉపయోగించి ఈ పండు తోలుచు పురుగులను పూర్తిగా అరికట్టవచ్చు.

ప్రభుత్వానికి మద్దతుగా..  బొత్స అనుమానాస్పద వ్యాఖ్యలు 
Advertisement

తాజా వార్తలు