Sesame Crop : నువ్వుల పంటను ఆశించే బూడిద తెగుళ్లను నివారించే పద్ధతులు..!

నువ్వుల పంట( Sesame crop )ను ఖరీఫ్ లో వర్షాధారంగా, రబీలో నీటి వసతి ఉండే ప్రాంతాల్లో పండిస్తారు.

తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఇచ్చే పంటగా నువ్వుల పంటను చెప్పుకోవచ్చు.

ఈ పంటకు పెట్టుబడి వ్యయం చాలా తక్కువ.నువ్వులలో చాలా రకాలు ఉన్నాయి.

మేలైన రకాలను ఎంపిక చేసుకోవడంతో పాటు సరైన సమయంలో విత్తుకోవాలి.తెగులు నిరోధక సర్టిఫైడ్ కంపెనీకి చెందిన విత్తనాలతో మాత్రమే సాగు చేపట్టాలి.

నీరు నిల్వ ఉండే నేలలు, ఆమ్లక్షార గుణాలు ఉండే నేలలు తప్ప అన్ని రకాల నేలలు నువ్వుల పంట సాగుకు అనుకూలంగానే ఉంటాయి.పొలాన్ని పొడి దుక్కి చేసి విత్తుకుంటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి.విత్తనాలు( Sesame SEEDS ) ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి.

Advertisement

ఒక కిలో విత్తనాలను రెండు మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్( Imidacloprid ) తో విత్తనశుద్ధి చేసుకోవాలి.ఒక ఎకరం పొలానికి 2.5 కిలోల విత్తనాల అవసరం.ఈ విత్తనాలకు మూడింతలు ఇసుక కలిపి గొర్రుతో విత్తుకోవాలి.

మొక్కల మధ్య 6 అంగుళాల దూరం, మొక్కల వరుసల మధ్య 12 అంగుళాల దూరం ఉంటే మొక్కలు సూర్యరశ్మి, గాలి బాగా తగిలి ఆరోగ్యకరంగా పెరుగుతాయి.

ఆఖరి దుక్కిలో ఒక ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు 15 కిలోల నత్రజని, ఎనిమిది కిలోల పోటాష్, 8 కిలోల భాస్వరం ఎరువులు వేసుకోవాలి.నువ్వుల పంటకు నీటి అవసరం చాలా తక్కువ.విత్తిన వెంటనే ఒక తేలికపాటి నీటి తడి అందించాలి.

పంట పూత, కాయ దశలో ఉన్నప్పుడు నీటి తడులు అందించాలి.నువ్వుల పంటకు చీడపీడల, తెగుళ్ల బెడద కాస్త ఎక్కువ.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
సెనేట్ ఆమోదం లేకుండానే కేబినెట్ నియామకాలు.. ట్రంప్ వ్యూహాత్మక ఎత్తుగడ

కాబట్టి పొలంలో కలుపు మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి.ఇక నువ్వుల పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ల విషయానికి వస్తే బూడిద తెగుళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.

Advertisement

నువ్వుల మొక్క లేత ఆకులపై తెల్లని బూడిద పొడి మచ్చలు ఏర్పడితే.ఆ మొక్కకు బూడిద తెగుళ్లు సోకినట్టే.

వెంటనే మూడు గ్రాముల నీటిలో కరిగే గంధకపు పొడిని ఒక లీటర్ నీటిలో కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

తాజా వార్తలు