నాణ్యమైన విద్యుత్ కోసమే మోటార్లకు మీటర్లు: మంత్రి పెద్దిరెడ్డి

నాణ్యమైన విద్యుత్ అందించేందుకే మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.స్మార్ట్ మీటర్ల వినియోగంతో విద్యుత్ ఆదా అవుతుందని పేర్కొన్నారు.

ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా రైతులకు నగదు జమ అవుతుందని చెప్పారు.రైతులు వాడిన విద్యుత్ కు ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

కానీ వ్యవసాయ మీటర్లపై టీడీపీ దుష్ఫ్రచారం చేస్తుందని మండిపడ్డారు.మీటర్ల ఏర్పాటు వలన విద్యుత్ సరఫరాపై రైతులకు హక్కు కల్పించినట్లు అవుతుందన్నారు.

రాష్ట్రంలో మార్చిలోపు మీటర్ల ఏర్పాటును పూర్తి చేస్తామని వెల్లడించారు.అదేవిధంగా తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలపై కోర్టును ఆశ్రయించామని తెలిపారు.

Advertisement

మీటర్ల ఏర్పాటు నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement