మెర్సిడెస్-బెంజ్ నుంచి కొత్త లగ్జరీ వెహికల్ లాంచ్.. ఆఫ్-రోడ్డు డ్రైవ్స్‌కి బెస్ట్!!

మెర్సిడెస్ బెంజ్( Mercedes Benz ) భారతదేశంలో దాని G-క్లాస్ SUV అప్‌డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది.మునుపటి G 350d మోడల్‌ను మరింత శక్తివంతమైన, స్టైలిష్ G 400dతో కంపెనీ భర్తీ చేసింది.

దీనిని రూ.2.55 కోట్ల ధర (ఎక్స్‌షోరూమ్‌)తో ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది.ఈ G 400d కారు అడ్వాన్స్డ్‌ ఫీచర్లతో మెరుగైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

కస్టమర్లు ఇప్పుడు వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు.డెలివరీలు ఈ ఏడాది చివర్లో ప్రారంభమవుతాయి.

జీ 400d 330hp, 3.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది ప్రీవియస్ మోడల్ పోలిస్తే పవర్‌లో ఇది గణనీయమైన పెరుగుదలను అందిస్తుంది.ఇది కేవలం 6.4 సెకన్లలో 0 నుంచి 100kph వరకు స్పీడ్ అందుకోగలదు, ఇది మునుపటి కంటే ఒక సెకను వేగంగా గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది.ఈ ఎస్‌యూవీలోని( G 400d SUV ) బలమైన నిచ్చెన-ఫ్రేమ్ నిర్మాణం, G-మోడ్ అనేవి ఆఫ్-రోడ్ డ్రైవింగ్ కు బెస్ట్ గా నిలుస్తాయి.

ఇది 241మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 700మిమీ వరకు నీటిలో ప్రయాణించగల సామర్థ్యంతో వస్తుంది.

Advertisement

Mercedes-Benz భారతదేశంలో G 400d రెండు వేరియంట్లను అందిస్తోంది.అవే అడ్వెంచర్ ఎడిషన్, AMG లైన్. భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన అడ్వెంచర్ ఎడిషన్‌లో ప్రత్యేకమైన ఎక్స్‌టర్నల్ పెయింట్ ఆప్షన్స్, 18-అంగుళాల రూఫ్ రాక్, స్పేర్-వీల్ హోల్డర్, రిమూవబుల్ లాడర్ ఉన్నాయి.

AMG లైన్ వేరియంట్ AMG స్టైలింగ్ క్యూస్, 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్లైడింగ్ సన్‌రూఫ్, ప్రీమియం బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తుంది.భారతీయ మార్కెట్లో, ఈ కొత్త మోడల్ ల్యాండ్ రోవర్ డిఫెండర్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 వంటి వాహనాలతో పోటీపడుతుంది.

Advertisement

తాజా వార్తలు