నూతన భవనంలో కొలువుదీరిన పార్లమెంట్ సభ్యులు

ఢిల్లీలోని నూతన పార్లమెంట్ భవనంలో ఎంపీలు కొలువుదీరారు.ఈ నేపథ్యంలో లోక్ సభ సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు.

నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలకు సభ్యులు అందరూ సహకరిస్తారని భావిస్తున్నట్లు ఓం బిర్లా పేర్కొన్నారు.గణేశ్ చతుర్థి రోజున కొత్త పార్లమెంట్ భవనంలోకి రావడం శుభసూచకమని తెలిపారు.

అనంతరం నూతన పార్లమెంట్ భవనంలోకి ఎంపీలకు ప్రధానమంత్రి మోదీ స్వాగతం పలికారు.అమృతకాలంలో కొత్త సంకల్పాలతో కొత్త లక్ష్యాల కోసం ముందుకెళ్తున్నామన్నారు.

ఈ క్రమంలోనే మరి కాసేపటిలో లోక్ సభ ఎదుటకు మహిళా రిజర్వేషన్ బిల్లురానుంది.ఈ మేరకు బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

అయితే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో రేపు చర్చ జరగనుంది.మరోవైపు మధ్యాహ్నం 2.15 గంటలకు రాజ్యసభ ప్రారంభం కానుంది.ఈనెల 21న రాజ్యసభలో కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనుంది.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement