రాజీనామా చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే..!!

ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వ్యవహారం అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టించింది.

రెండోసారి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని భావించిన కొంత మంది ఆశావహులు కి పదవి రాకపోవడంతో మనస్తాపం చెందారు.

ఈ క్రమంలో బుజ్జగింపు కార్యక్రమాలు స్టార్ట్ అయిన గాని.ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.

చాలామంది నేతలు పార్టీ హైకమాండ్ పై మండి పడుతున్నారు.దీనిలో భాగంగా మాజీ మంత్రి మేకతోటి సుచరిత.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.అయితే తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

ఇదే సమయంలో తన నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు రాజీనామా చేయవద్దని తెలిపారు.ఇక ఇదే సమయంలో రాజకీయాల్లో ఉన్నంతవరకు వైసీపీలోనే కొనసాగుతానని హామీ ఇచ్చారు.

మేకతోటి సుచరిత ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఇదే బాటలో వైసీపీ నుండి ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు.

మంత్రి పదవి రాకపోవడంతో వాళ్లు కూడా తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ ఏపీ రాజకీయాల్లో బలంగా వినబడుతుంది.

తాజా వార్తలు