'మెగా157' టైటిల్ ఏంటో తెలుసా.. దానినే ఫిక్స్ చేయనున్న మేకర్స్!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) చేతిలో ప్రెజెంట్ రెండు సినిమాలు ఉన్నాయి.156, 157 సినిమాలను ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.

మొన్నటి వరకు ఈయన కెరీర్ స్పీడ్ గానే కొనసాగగా ఈ మధ్య మళ్ళీ డల్ అయ్యాడు.

.భోళా శంకర్ ( Bholaa Shankar )రిలీజ్ తర్వాత మెగాస్టార్ కు భారీ షాక్ తగిలింది.అందుకే ఈ సినిమా తర్వాత ఆచితూచి అడుగులు వేస్తూ భోళా వంటి ప్లాప్ ను మరోసారి రిపీట్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి ఆగస్టులో తన పుట్టిన రోజు నాడు రెండు కొత్త ప్రాజెక్టులను ప్రకటించగా అందులోమెగా 157 ఒకటి.ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

ఇక ఈ సినిమాను బింబిసార డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి ( Director Mallidi Vassishta )తెరకెక్కిస్తున్న విషయం విదితమే. బింబిసార వంటి హిట్ అందుకున్న వసిష్ఠ మెగాస్టార్ తో కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాను తీయబోతున్నట్టు తెలుస్తుంది.

Advertisement

పంచభూతాల కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పారు.అలాగే ఈసారి ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ కంపెనీ పని చేయనుందని సమాచారం.

సోషియో ఫాంటసీ జోనర్ లో సాగుతూ అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ఈ సినిమాను తెరకెక్కించ బోతున్నారు.త్వరలోనే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో మెగాస్టార్ పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని అంటున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. ముల్లోక వీరుడు అనే టైటిల్ ను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్టు టాక్.కాగా ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా అనుష్క శెట్టిని( Anushka Shetty ) తీసుకోనున్నట్టు టాక్.

ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఫాస్ట్ గా పూర్తి చేసి వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు