లక్‌ కోసం పేరు మార్చుకున్న మెగా హీరో... సక్సెస్‌ దక్కేనా?

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలు, స్టార్స్‌ లక్‌ కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా చివరకు అన్ని కూడా విజయం కోసం, అవకాశాల కోసం అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పెద్ద ఎత్తున ప్రముఖులు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ కోసం కొన్ని సిల్లీ సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు.అందులో ముఖ్యంగా పేరు మార్చుకోవడం ఒకటి.

ఇప్పటి వరకు చాలా మంది స్టార్స్‌ కూడా తమ స్క్రీన్‌ నేమ్స్‌ను మార్చుకున్నారు.లక్ష్మీ రాయ్‌ అని ఉన్న పేరును రాయ్‌ లక్ష్మి అని ఎలా అయితే హీరోయిన్‌ మార్చుకుందో అలా ఎంతో మంది కూడా తమ పేరులోని అక్షరాలను పెంచుకోవడం, లేదా అటు ఇటుగా పెట్టుకోవడం చేస్తూ ఉన్నారు.

ఆ జాబితాలో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ చేరాడు.ఈ మెగా హీరో వరుసగా ఆరు ఫ్లాప్‌లను చవి చూశాడు.

Advertisement

దాంతో ఈయన పరిస్థితి మరీ దారుణంగా తయారు అయ్యింది.ఈయనకు అవకాశాలు రావడమే గగనం అయ్యింది.

కుటుంబ సభ్యులు తమకున్న పరిచయాలతో సినిమాలు చేయిస్తున్నారు.మరో మూడు నాలుగు సినిమాలు ఇలాగే ఫెయిల్‌ అయ్యితే వీరి పరిస్థితి ఏంటా అంటూ అంతా ఆందోళన చెందుతున్నారు.

మెగా మేనల్లుడికి ఇలాంటి పరిస్థితి అంటూ బాధపడుతున్నారు.

ఈ సమయంలోనే కొందరు తేజూకు పేరు మార్చుకోవాలని సలహ ఇచ్చారట.దాంతో ఇప్పటి వరకు సాయి ధరమ్‌ తేజ్‌ అని ఉన్న పేరును సాయి తేజ్‌ అని మార్చుకోబోతున్నాడు.ధరమ్‌ అనే పదాన్ని ఇకపై సినిమా స్క్రీన్‌పై వాడకూడదని నిర్ణయించుకున్నాడట.

How Modern Technology Shapes The IGaming Experience
కాలేయాన్ని శుభ్రం చేసే డ్రైడ్ పపాయ..ఎలా తీసుకోవాలంటే?

ఈ నిర్ణయంతో అయినా తేజూకు సక్సెస్‌ కలిసి వస్తుందేమో చూడాలి.పెద్ద ఎత్తున తేజూ సినిమాలు చేసినా ఫ్లాప్‌లే అవుతున్నాయి.

Advertisement

తాజాగా ఈయన కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి అనే చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే.త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ చిత్రం పేరు మార్చుకున్న కారణంగా తేజూకు సక్సెస్‌ను తెచ్చి పెడుతుందేమో చూడాలి.

తాజా వార్తలు