మెగా గాడ్ ఫాదర్ టీజర్ డేట్ ఫిక్స్.. అభిమానులకు పూనకాలే?

మలయాళంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాగా రీమేక్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఈ సినిమా షూటింగ్ పనులను త్వరగా పూర్తిచేసుకుని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు.

గాడ్ ఫాదర్ సినిమా నుంచి టీజర్ విడుదల తేది ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు.ఈ సినిమా నుంచి టీజర్ ఆగస్టు 21వ తేదీ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారక పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.

ఇకపోతే ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టనున్నారు.ఈ క్రమంలోనే ఈ నెల టీజర్, వచ్చే నెల ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇప్పటికే ఈ సినిమా నుంచి మెగాస్టార్ ఫస్ట్ లుక్ విడుదల కావడంతో ఈయన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ సైతం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో సందడి చేయనున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తుండడం గమనార్హం.

ఈ సినిమా టీజర్ విడుదల తేదీనీ ప్రకటించడంతో మెగా అభిమానులు ఈ టీజర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు