బీఎస్పీ తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ప్రకటించిన మాయావతి..!!

హైదరాబాద్ సరూర్ నగర్ లో ఏర్పాటు చేసిన "తెలంగాణ భరోసా" సభకు మాయావతి ( Mayawati ) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం ఆ తర్వాత మర్చిపోవడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిందని అన్నారు.

బహుజన వర్గాలకు పూర్తిస్థాయిలో లబ్ధి చేకూరటం లేదు.ఓబీసీ వర్గాల కోసం రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్న సమయంలో ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించాం.

పేదవారు తీసుకున్న రుణాలు కూడా బీఎస్పీ ప్రభుత్వం( BSP ) కట్టింది.పట్టణాల్లో ఉండే పేదలకు కూడా సౌకర్యవంతంగా నివసించే ఏర్పాటు చేయటం జరిగింది.ఈ క్రమంలో తెలంగాణలో బీఎస్పీ బలపడుతుంటే రాజకీయ దురుద్దేశంతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి.

Advertisement

సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారు.

తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి వస్తే ప్రవీణ్ కుమార్( RS Praveen Kumar ) సీఎం అవుతారని మాయావతి ప్రకటించారు.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారు.తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అత్యధిక ఎంపీ స్థానాలు రాష్ట్రం నుంచి గెలిపించుకోవాలి అని మాయావతి స్పష్టం చేశారు.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement

తాజా వార్తలు