మాతృదేవోభవ చైల్డ్ ఆర్టిస్ట్ లు గుర్తు ఉన్నారా..? ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారు ..?

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే సాంగ్ తెలుగు సినిమా చరిత్రలో ఎంత పెద్ద హిట్టో మనందరికి తెలిసిందే.

కీరవాణి గారు సంగీతం అందించి పాడిన ఈ పాట మాతృదేవోభవ అనే సినిమాలోది.

ఈ పాటే కాదు ఈ సినిమా కూడా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది.అంతేకాదు ఈ సినిమా ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో 365 రోజులు ఆడింది.

ఎప్పుడో 1993 విడుదలైన ఈ సినిమాని మనం ఇప్పుడు చూసిన కచ్చితంగా మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.ఇక ఈ సినిమాలో అందరికి నచ్చిన ముఖ్యమైన అంశం ఏమిటంటే అమ్మతనం.

అచ్చమైన అమ్మతనాన్ని మనం ఈ సినిమాలో చూడొచ్చు.తాను క్యాన్సర్ తో చనిపోతానని తెలిసి, తనపేగు తెంచుకుని పుట్టిన పిల్లలు అనాధలుగా మిగలకూడదని, వేరే వాళ్ళకి దత్తత ఇస్తుంది.

Advertisement
Matru Devo Bhava Child Artists Then And Now, Matrudevo Bhava , Matru Devo Bhava

ఈ క్రమంలోనే తన పిల్లలు తన దగ్గర నుండి దూరం అవుతుంటే ఆ తల్లి పడే బాధను కళ్ళకు కట్టినట్లు చూపించి అందరిని ఏడిపించింది ఈ సినిమాలో అమ్మ పాత్రలో నటించిన హీరోయిన్ మాధవి.ఈ సినిమా తర్వాత అమ్మ సెంటిమెంట్ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఈ సినిమాని కొట్టిన సినిమా లేదనే చెప్పాలి.

ఇక ఈ సినిమాలో వర్సిటైల్ యాక్టర్ నాజర్ కూడా నాన్న పాత్రలో అదిరిపోయే నటనను కనబరిచారు.

Matru Devo Bhava Child Artists Then And Now, Matrudevo Bhava , Matru Devo Bhava

అసలు ఇంట్లో భార్య నలుగురు పిల్లలు ఉంటే తండ్రి ఎంత బాధ్యతగా ఉండాలో కదా.కానీ మొదట్లో అసలు కుటుంబాన్ని పట్టించుకోకుండా, భాద్యతగా ఉండకుండా అల్లరి చిల్లరిగా ఉండే పాత్రలో నాజర్ నటనకు ఎవరైనా హేట్సాఫ్ చెప్పాల్సిందే.ఇక ఆతర్వాత కొన్ని కొన్ని ఇన్సుడెంట్స్ వలన తన తప్పును తెలుసుకొని మంచి తండ్రిగా మారతాడు.

ఇక మాధవి అండ్ నాజర్ కి నలుగురు పిల్లలుగా బేబీ సీన, మాస్టర్ మార్టిన్, మాస్టర్ ఫణి, మాస్టర్ తేజ అనే నలుగురు పిల్లలు నటించారు.ఈ పిల్లలు నలుగురు కూడా తమ తమ నటనతో అందరిని ఏడిపించారు.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ లో వీళ్ళు కనబరిచిన నటన చూస్తే వీళ్ళు పెద్దయ్యాక మంచి మంచి నటులు అవ్వడం కాయం అనుకున్నారు కానీ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా.

Matru Devo Bhava Child Artists Then And Now, Matrudevo Bhava , Matru Devo Bhava
Advertisement

ఈ సినిమాలో ముందుగా అందరికంటే పెద్దమ్మాయి రాధా పాత్రలో నటించిన బేబీ సీన గురించి మాట్లాడుకుంటే, సీన తమిళంలో కొన్ని సినిమాలు అలాగే సీరియల్స్ నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాదు మన చిరంజీవి నటించిన హిట్లర్ సినిమాను మమ్ముట్టి తో రీమేక్ చేయగా ఆ సినిమాలో ఆయనకు చెల్లెలిగా కూడా సీనా నటించింది.అయితే ఈమె సినిమాల కంటే సీరియల్స్ లోనే బాగా ఫేమస్.

అలా తమిళ సీరియల్స్ లో బిజీ గా ఉన్న సీనా జాన్ అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది.వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఇక మాతృదేవో భవ సినిమాలో చివరికి వరకు తల్లిని విడవకుండా, తల్లితోనే ఉన్న కుర్రాడు మాస్టర్ మార్టిన్. అప్పట్లో ఈ బుడతడు మూడవ తరగతి చదివేవాడు.కానీ ఈ సినిమా తర్వాత మళ్లీ దేనిలోనూ నటించలేదు.అయితే మద్రాసు లయోలా కాలేజ్ లో ఇంజినీరింగ్ చదివి, జాబ్ సంపాదించి ఇప్పుడు బాగా సెటిల్ అయ్యాడు.2017 లోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.అయితే మార్టిన్ మాత్రం మంచి అందగాడు.

ఒక హీరోకి ఉండాల్సిన లక్షణాలు అన్ని కూడా ఉన్నాగాని, సినిమాల్లో ఆసక్తి లేదని స్పష్టంగా తెలిపాడు.ఇంకా మిగతా చైల్డ్ ఆర్టిస్టులు ఫణి అయితే తేజ కూడా మళ్ళీ సినిమాల్లో నటించలేదు.

బట్ వారి వారికిష్టమైన రంగాల్లో బాగా స్థిరపడ్డారు.ఇక మాతృదేవోభవ సినిమాని తమిళంలో అక్షదూత అనే పేరుతో రీమేక్ చేసారు అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

తాజా వార్తలు