కెరియర్ స్టార్టింగ్ లో రవితేజ అంత కష్టపడ్డాడా..?

రవితేజ( Raviteja ) ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో చాలా కష్టాలు పడిన విషయాలు మనకు తెలిసిందే.

ఆయన ఒక్కొక్క క్యారెక్టర్ కోసం చాలా కష్ట పడ్డాడు.

అందుకే ఆయన ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాడు అని కూడా ఆయన గురించి గొప్పగా చెప్తూ ఉంటారు.చిరంజీవి( Chiranjeevi ) తర్వాత రవితేజ ని చాలా మంది ఇన్స్పరేశన్ గా తీసుకుంటున్నారు అందుకే ఇండస్ట్రీ కి వచ్చే నటుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పాలి.

ప్రస్తుతం ఆయన చేస్తున్న రావాణాసుర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో ఆయన స్టార్టింగ్ లో ఎంత కష్టపడ్డాడు అనే విషయాల గురించి చెప్పాడు.అందులో భాగంగానే ఆయన బండ్లో పెట్రోల్ పోయించడానికి డబ్బులు లేకపోతే ఉన్న పెట్రోల్ తోనే అడ్జస్ట్ చేసుకునేవాడు.

ఎల్వి ప్రసాద్ నుంచి పంజాగుట్ట( Panjagutta ) పోయే రోడ్లో డౌన్ వచ్చినప్పుడు బండి ని ఆఫ్ చేసి కనీసం కొంత పెట్రోల్ అయిన సేవ్ అవుతుంది అని అలా చేసేవారట.

Advertisement

గతం లో ఆయన చేసిన సినిమాలు చూస్తే వరుసగా సక్సెస్ లు కొట్టాడు.అందులో భాగంగానే ధమాకా( Dhamaka ) సినిమా చేసి మంచి విజయం అందుకున్నారు అలాగే ఈ సంవత్సరం లో చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా( Waltair Veerayya )లో ఒక మంచి క్యారెక్టర్ చేసి మంచి హిట్ కొట్టాడు.ఇక ఈ సంవత్సరం రావణాసుర సినిమాతో ఇంకో హిట్ కొట్టడానికి మళ్ళీ మన ముందుకు వస్తున్నాడు.

ఈ సినిమా తరువాత కూడా ఇంకో రెండు మూడు సినిమాలకి కమిట్ అయిన రవితేజ ఈ సంవత్సరమే ఇంకో సినిమా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక తొందర్లోనే ఆయన కొడుకుని కూడా ఇండస్ట్రీ కి పరిచయం చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే రాజా ది గ్రేట్( Raja The Great ) సినిమాలో రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన మహదన్ ఆ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చిందనే చెప్పాలి.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?
Advertisement

తాజా వార్తలు